Telangana: సోనియాతో సీఎం రేవంత్ భేటీ.. ఆ విషయాలపైనే ప్రధాన చర్చ..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణలో నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ పదవులు, మంత్రి పదవుల ఖాళీల భర్తీపై చర్చించారు. సీఎం ఢిల్లీ నుంచి వచ్చాక మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది.

New Update
Telangana: సోనియాతో సీఎం రేవంత్ భేటీ.. ఆ విషయాలపైనే ప్రధాన చర్చ..!

Telangana CM Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీలపై చర్చించారు. ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలనే దానిపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే సీనియర్లకు పదవులు ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. దీంతో ఎవరిని పదవులు వరించనున్నాయా? అనే ఆసక్తి నెలకొంది. ఇక టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌కు ఏ పదవి ఇవ్వాలనే అంశంపైనా ఈ ఇద్దరు చర్చించినట్లు తెలుస్తోంది.


అలాగే, మంత్రివర్గం కూర్పుపైనా సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దాంతో ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే దానిపై ఇరువురు చర్చించారు. మైనార్టీ కోటాలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై సోనియాతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు రాగానే మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. కాగా, నామినేటెడ్‌ పదవుల కోసం రేవంత్‌పై నేతల నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. అధిష్టానం ఓకే అంటే నామినేటెడ్‌ పదవులను సైతం భర్తీ చేసే ఛాన్స్‌ ఉంది.

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మొదట ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో తెలంగాణకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాల్సిందిగా కోరారు. అలాగే.. తెలంగాణకు ప్రాజెక్టులు ఇవ్వాలని, పాలమూరు రంగారెడ్డి పతకానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరారు.

Also Read:

ఆరు గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ రెడీ..!

పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

Advertisment
తాజా కథనాలు