Red Aloe Vera : ఆకుపచ్చ కలబంద కంటే ఎరుపు కలబంద బెటరా?..నిపుణులు ఏమంటున్నారు? ఆకుపచ్చ కలబంద కంటే ఎరుపు కలబంద 22 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. ఉష్ణమండల, శుష్క ప్రాంతాలలో కనిపించే ఈ మొక్కను 'కింగ్ ఆఫ్ అలోవెరా' అని పిలుస్తారు. ఈ రంగు కలబంద జెల్‌తో ముడతలు, మొటిమలు తగ్గుతాయి. పొడి చర్మ సమస్యను కూడా సాల్వ్ చేస్తుంది. By Vijaya Nimma 19 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Aloe Vera : పచ్చి కలబంద(Aloe Vera) వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు కానీ ఎరుపు రంగు కలబంద ఆకుపచ్చ కలబంద కంటే 22 రెట్లు ఎక్కువ శక్తివంతమైనదని నిపుణులు అంటున్నారు. ఉష్ణమండల, శుష్క ప్రాంతాలలో కనిపించే ఈ ఎర్రటి కలబంద మొక్కను దాని ఔషధ గుణాల కారణంగా 'కింగ్ ఆఫ్ అలోవెరా' అని పిలుస్తారు. రెడ్ కలబందలో విటమిన్ ఎ, సి, ఇ, బి12తో పాటు ఫోలిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తాయి. అంతేకాకుండా కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిది: ఎరుపు రంగు కలబంద(Red Color Aloe Vera) లో ఉండే సపోనిన్లు, స్టెరాల్స్ మన గుండెను రక్షిస్తాయి. నొప్పి నుంచి ఉపశమనం: ఎరుపు కలబందలోని సాలిసిలిక్ యాసిడ్, పాలీశాకరైడ్‌లు కండరాలను రిలాక్స్ చేసి వాపును తగ్గిస్తాయి. తలనొప్పి, మైగ్రేన్‌ల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. చర్మానికి ఒక వరం: ఎరుపు రంగు కలబంద జెల్(Aloe Vera Gel) పొడి చర్మం, ముడతలు, మొటిమలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎగ్జిమాను కూడా అదుపులో ఉంచుతాయి. అంతేకాకుండా కాలిన గాయాలు, సోరియాసిస్, కీటకాల కాటు, స్కాల్ప్ ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే కొల్లాజెన్ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. షుగర్ కంట్రోల్: రెడ్ కలబంద ప్రీ-డయాబెటిస్(Pre-Diabetes) లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్‌లో మాత్రం ఇది పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఆకుపచ్చ కలబంద కంటే ఎరుపు కలబంద చాలా శక్తివంతమైనది, ప్రయోజనకరమైనదని నిపుణులు అంటున్నారు. సాగు పరిమితంగా ఉండడంతో దీని ధర ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. ఇది కూడా చదవండి : పొగాకు మాత్రమే కాదు మన అలవాట్లు కూడా క్యాన్సర్‌కు కారణమా? గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: గాఢ నిద్రలో ఉన్నవారిని ఒక్కసారిగా లేపితే బ్రెయిన్‌కి ప్రమాదమా? #health-benefits #health-care #best-health-tips #green-aloe-vera #red-aloevera మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి