Health: కొంతమందికి ఎంత తిన్నా మళ్లీమళ్లీ ఆకలి వేస్తుంటుంది. అప్పుడు మరోసారి తింటుంటారు. ఇలా మోతాదుకు మించి ఇన్‌టేక్ వెళ్తుంది. అప్పుడు అనవసరమైన హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బరువు కూడా పెరుగుతారు. నిజానికి కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఆకలి వేయడం చాలా సహజం. తినడం ద్వారానే మన శరీరం బాగా పనిచేస్తుంది. కానీ కడుపు నిండా తిన్నా రోజంతా ఆకలిగా అనిపిస్తుంటే ఏదో సమస్య ఉన్నట్టు అర్థం. ఎంత తిన్నా రకరకాల పదార్థాలను తినాలనే కోరిక ఉంటుందా..?
తరచుగా ఆకలి అనిపించడానికి కారణాలు ఇవే:
ప్రోటీన్ లోపం:
- మీరు తగినంత ప్రోటీన్ తీసుకోకపోతే.. పదేపదే ఆకలిగా అనిపించవచ్చు. ఎందుకంటే ఆకలిని నియంత్రించడానికి శరీరంలో తగినంత ప్రోటీన్ ఉంటుంది. ఆహారంలో ప్రోటీన్ తక్కువగా ఉంటే దీని కారణంగా ఒక వ్యక్తి తరచుగా ఆకలితో ఉంటాడు. ప్రోటీన్ శక్తిని అందించడంతో పాటు ఆకలిని పెంచే హార్మోన్లను నియంత్రిస్తుంది ఆహార కోరికలను తగ్గించడానికి కూడా పనిచేస్తుంది. అందుకే ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు డైట్ లో చేర్చుకోవాలి.
శరీరంలో ఫైబర్ లేకపోవడం:
- శరీరంలో తగినంత ఫైబర్ లేనప్పుడు మనకు తరచుగా ఆకలిగా అనిపిస్తుంది. ఆకలిని తగ్గించే హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి ఫైబర్ పని పనిచేస్తుంది. ఆహారంలో ఎక్కువ ఫైబర్ ఉండేలా చూసుకోండి.
అధిక ఒత్తిడి:
- ప్రస్తుత జీవనశైలి చాలామందికి ఒత్తిడితో కూడుకున్నది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. చాలా ఎక్కువ ఒత్తిడి కారణంగా శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ పెరిగి తరచూ ఆకలి వేస్తుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఎంత తింటున్నామో ఎందుకు తింటున్నామో తెలియకుండా తింటుంటాం.
నిద్ర లేకపోవడం
- మీకు పదేపదే ఆకలిగా అనిపిస్తే మీ నిద్ర సరిగా పూర్తి కావడం లేదని అర్థం చేసుకోండి. నిద్ర అనేది జీర్ణవ్యవస్థకు సంబంధించినది. నిద్రలేమి ఆకలిని కూడా పెంచుతుంది. ఆకలిని సూచించే గ్రెలిన్ అనే హార్మోన్ మీకు తగినంత నిద్ర రాకపోతే పెరుగుతుంది. ఇది నాన్‌స్టాప్‌గా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి నిద్ర అవసరం.
- శుద్ధి చేసిన పిండి పదార్థాలు గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిని అధికంగా తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. శుద్ధి చేసిన పిండి పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల వెంటనే ఇంకోటి ఏదో తినాలని అనిపిస్తుంది. అప్పుడు ఊబకాయం పెరుగుతుంది. ఇక డయాబెటిస్, థైరాయిడ్ లాంటి వ్యాధులు కూడా తరచుగా ఆకలికి కారణమవుతాయి.
ఇది కూడా చదవండి: ఇలా చేస్తే గులాబీ మొక్కలోని ప్రతీ కొమ్మకు పూలు పూస్తాయి..!!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.