Health: పదే పదే ఆకలి వేస్తోందా? నిర్లక్ష్యం చేయకండి.. సమస్య ఇదే కావొచ్చు! డయాబెటిస్, థైరాయిడ్ లాంటి వ్యాధులు తరచుగా ఆకలికి కారణమవుతాయి. నిద్ర లేకపోవడం, అధిక ఒత్తిడి, శరీరంలో ఫైబర్ లేకపోవడం, శుద్ధి చేసిన పిండి పదార్థాలు ఎక్కువగా తినడం, ప్రోటీన్ లోపం లాంటివి ఆకలిని పెంచే హార్మోన్లను ఉత్పత్తికి కారణం అవుతాయి. By Vijaya Nimma 28 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Health: కొంతమందికి ఎంత తిన్నా మళ్లీమళ్లీ ఆకలి వేస్తుంటుంది. అప్పుడు మరోసారి తింటుంటారు. ఇలా మోతాదుకు మించి ఇన్‌టేక్ వెళ్తుంది. అప్పుడు అనవసరమైన హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బరువు కూడా పెరుగుతారు. నిజానికి కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఆకలి వేయడం చాలా సహజం. తినడం ద్వారానే మన శరీరం బాగా పనిచేస్తుంది. కానీ కడుపు నిండా తిన్నా రోజంతా ఆకలిగా అనిపిస్తుంటే ఏదో సమస్య ఉన్నట్టు అర్థం. ఎంత తిన్నా రకరకాల పదార్థాలను తినాలనే కోరిక ఉంటుందా..? తరచుగా ఆకలి అనిపించడానికి కారణాలు ఇవే: ప్రోటీన్ లోపం: మీరు తగినంత ప్రోటీన్ తీసుకోకపోతే.. పదేపదే ఆకలిగా అనిపించవచ్చు. ఎందుకంటే ఆకలిని నియంత్రించడానికి శరీరంలో తగినంత ప్రోటీన్ ఉంటుంది. ఆహారంలో ప్రోటీన్ తక్కువగా ఉంటే దీని కారణంగా ఒక వ్యక్తి తరచుగా ఆకలితో ఉంటాడు. ప్రోటీన్ శక్తిని అందించడంతో పాటు ఆకలిని పెంచే హార్మోన్లను నియంత్రిస్తుంది ఆహార కోరికలను తగ్గించడానికి కూడా పనిచేస్తుంది. అందుకే ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు డైట్ లో చేర్చుకోవాలి. శరీరంలో ఫైబర్ లేకపోవడం: శరీరంలో తగినంత ఫైబర్ లేనప్పుడు మనకు తరచుగా ఆకలిగా అనిపిస్తుంది. ఆకలిని తగ్గించే హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి ఫైబర్ పని పనిచేస్తుంది. ఆహారంలో ఎక్కువ ఫైబర్ ఉండేలా చూసుకోండి. అధిక ఒత్తిడి: ప్రస్తుత జీవనశైలి చాలామందికి ఒత్తిడితో కూడుకున్నది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. చాలా ఎక్కువ ఒత్తిడి కారణంగా శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ పెరిగి తరచూ ఆకలి వేస్తుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఎంత తింటున్నామో ఎందుకు తింటున్నామో తెలియకుండా తింటుంటాం. నిద్ర లేకపోవడం మీకు పదేపదే ఆకలిగా అనిపిస్తే మీ నిద్ర సరిగా పూర్తి కావడం లేదని అర్థం చేసుకోండి. నిద్ర అనేది జీర్ణవ్యవస్థకు సంబంధించినది. నిద్రలేమి ఆకలిని కూడా పెంచుతుంది. ఆకలిని సూచించే గ్రెలిన్ అనే హార్మోన్ మీకు తగినంత నిద్ర రాకపోతే పెరుగుతుంది. ఇది నాన్‌స్టాప్‌గా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి నిద్ర అవసరం. శుద్ధి చేసిన పిండి పదార్థాలు గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిని అధికంగా తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. శుద్ధి చేసిన పిండి పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల వెంటనే ఇంకోటి ఏదో తినాలని అనిపిస్తుంది. అప్పుడు ఊబకాయం పెరుగుతుంది. ఇక డయాబెటిస్, థైరాయిడ్ లాంటి వ్యాధులు కూడా తరచుగా ఆకలికి కారణమవుతాయి. ఇది కూడా చదవండి: ఇలా చేస్తే గులాబీ మొక్కలోని ప్రతీ కొమ్మకు పూలు పూస్తాయి..!! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-tips #health-benefits #being-hunger మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి