Janasena Party : జనసేనలోకి కీలక నేతలు..పవన్ వ్యూహం ఇదేనా?

ఆంధ్రాలో కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ఒకొక్కరే పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు.వాళ్ళందరూ జనసేనలో జాయి అవుతున్నారు.దీనికి కారణం టీడీపీలో ఛాన్స్ లేకపోవడమా లేక జనసేనలో చేరితే నెక్స్ట్ టైమ్ పదవులు దక్కుతాయన్న ఆశా అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.

author-image
By Manogna alamuru
New Update
ap

YCP Leaders Joining In JanaSena: 

ఆంధ్రాలో కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీలో చాలా మార్పులు జరుగుతున్నాయి. పార్టీలోని కార్యకర్తల దగ్గర నుంచి కీలకనేత వరకూ అందరూ రాజీనామాలు చేస్తున్నారు. తాజా ఒంగోలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాన్ని ఎట్టకేలకు నిజం చేశారు. ఈరోజు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు పంపారు. పార్టీ అధినేత నిర్ణయాలపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న బాలినేని జనసేనలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. గురువారం విజయవాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ కాబోతున్నాడని, ఈ భేటీ అనంతరం జనసేనలో ఎప్పుడు చేరబోయేది ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు రాజీనామా చేసిన బాలినేని ఒక్కరే కాదు అంతకు ముందు వైజాగ్‌లో జనసేనలో చేరిన వైసీపీ కార్యకర్తలు, ఇంకా పలువురు నేతలు కూడా జనసేనలోకే వెళ్ళారు. దీని వెనుక రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి టీడీపీలో ప్రస్తుతం అన్ని పదవుల్లో అందరూ ఉన్నారు. ఫయూచర్‌‌లో పదవి వస్తుందని ఆశించి ఇప్పుడు జాయిన్ అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేఈ కూటమిగా పోటీ చేశారు. కానీ ఇందులో ఎక్కువ స్థానాలు టీడీపీనే తీసుకుంది. దాంతో ఈ పార్టీలో అన్ని జిల్లాల్లో, పదుల్లో కీలక నేతు పాతుకుని పోయి ఉన్నారు. వచ్చే సారి ఎన్నికలు జరిగి...మళ్ళీ కూటమే అధికారంలోకి వచ్చినా..పాతవారిని తప్పించే అవకాశం లేదు. దాంతో ఏదో నామ్‌ కే వాస్తే పార్టీ మారాము అన్నది తప్పితే టీడీపీలో చేరిన వైసీపీ నేతలకు పెద్ద ఉపయోగం ఉండదు.

Also Read :  జమిలీ ఎన్నికలకు మేం వ్యతిరేకం– అసదుద్దీన్ ఓవైసీ

ఇక జనసేన (Janasena) విషయానికి వస్తే..వైసీపీ (YCP) కీ రాజీనామా చేసిన నేతను , కార్యకర్తలను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీలోకి ఆనందంగా ఆహ్వానిస్తున్నారు. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. మొన్న జరిగిన ఎన్నికల్లో జనసేన కేవలం 22 స్థానాల్లోనే పోటీ చేసింది. దానికి కారణం పార్టీలో పెద్ద నేతలు లేకపోవడం, సరైన బలం కూడా లేకపోవడం. దాంతో 2 సీట్లకే కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక జనసేనాని పవన్ కల్యాణ్ కొత్త వ్యూహాలకు పదును పెట్టారు. ప్రస్తుతం ఎలాగో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దాంతో పాటూ పార్టీ బలాన్ని పెంచుకోవడానికి కూడ ఆ ట్రై చేస్తున్నారు. దీంతో వచ్చేసారి ఎన్నికల్లో మరిన్ని సీట్లతో టీడీపీతో సమానంగా లేదా..ఇప్పటి కంటే కొంచెం ఎక్కువగా పోటీ చేయొచ్చు అన్నది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే తమ పార్టీకి ఎవరు వస్తామని చెప్పినా వెంటనే ఓకే చెప్పేతున్నారని అంటున్నారు.

అయితే ఇది కేవలం జనసేనకే కాదు పార్టీలోకి వస్తున్న వైసీపీ లీడర్లకు కూడా లాబించే విషయమే. ఎందుకంటే వీరికి టీడీపీలో పదవులు వచ్చే అవకాశమే లేదు. ముందే చెప్పుకున్న పార్టీ పేరు మార్పు తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు. అదే జనసేనలో జాయిన్ అయితే ఫ్యూచర్‌‌లో పదవి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పార్టీలో చేరి నెమ్మదిగా మంచి పేరు తెచ్చుకుంటే పార్టీ అండతో ఎన్నికల్లో కూడా గెలవచ్చు. ఇవన్నీ లోచించే వైసీపీ జంపింగ్ జపాంగ్‌లు తెలివిగా జనసేన కండువా కప్పుకుంటున్నారు.

Also Read :  లెబనాన్‌లో పేలుతున్న వాకీ టాకీలు.. 9మంది మరణం

Advertisment
తాజా కథనాలు