BRS Defeat: తెలంగాణలో బీఆర్ఎస్ ఘోర పరాభవానికి కారణాలివేనా..!?

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలను విశ్లేషిస్తున్నారు నిపుణులు. ప్రధానంగా నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పథకాలు అందని లబ్ధిదారులు, ప్రచారంలో వెనుకబాటుతనం సహా కారణాలు బీఆర్ఎస్‌ను దారుణంగా దెబ్బతీశాయి.

New Update
Telangana: పక్కా వ్యూహంతో బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు సాధించేనా?!

Reasons Behind BRS Defeat: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధిస్తామని పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ అనూహ్య రీతిలో ఘోర పరాభం చెందింది. ఏకంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక చోట ఓటమిపాలవడమే కాకుండా ఏకంగా మూడ స్థానంలో నిలిచారు. ఆయన పరాభంతో పాటు.. పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది ఓటమి రుచిని చూశారు. ఫలితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమైంది. కర్ణుడి మరణానికి వంద కారణాలు అన్నట్లుగా.. బీఆర్ఎస్ ఓటమికి కూడా అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్‌లు.

బీఆర్ఎస్‌ ఓటమికి, కాంగ్రెస్ గెలుపునకు కారణాలివే..!

నిరుద్యోగం: బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం నిరుద్యోగుల ఆగ్రహం. రాష్ట్ర ప్రభుత్వం పట్ల నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల లేకపోవడం, పరీక్షలు పదే పదే వాయిదా పడటం, టీఎస్‌పీఎస్‌సీ క్వశ్చర్ పేపర్ లీక్ అవడం నిరుద్యోగులతో పాటు.. ప్రజల్లోనూ తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. ఎన్నికల ఫలితాల రూపంలో ఈ అసంతృప్తి బయటపడింది.

ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి: ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. శాలరీలు సమయానికి పడకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృస్తి నెలకొంది. ఆ అసంతృప్తి ఈ ఎన్నికల ఫలితాల రూపంలో బహిర్గతమైంది.

ఆర్టీసీ ఉద్యోగుల 52 ఆందోళనలు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అసంతృప్తి, అర్హత ఉండి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లభించని వాళ్లు. దళిత బంధు, బీసీ బంధు వంటి ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి కాకుండా.. ఎమ్మెల్యేలు తమ అనుచరులకే కేటాయించడం ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది. కేసీఆర్ పథకాలు లబ్ధి పొందని ప్రజలు చేసిన ప్రచారం సహా పలు కారణాలు బీఆర్ఎస్ పార్టీని ఘోరంగా ఓడించాయని చెప్పుకోవచ్చు.

ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి: పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ.. ఆయన తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఆయన ప్రజలను కలవకపోవడం, ప్రజా సమస్యలను వినరనే ఆగ్రహంలో ప్రజల్లో ఉంది. ప్రగతి భవన్‌లోకి సామాన్యులకు అనుమతించకపోవడం, సచివాలయానికి రాకపోవడం కూడా ఆయనపై వ్యతిరేకతకు కారణంగా చెప్పుకోవచ్చు.

కొంపముంచిన అతివిశ్వాసం: తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి.. ఆ పార్టీ నేతల అతి విశ్వాసమే కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి చాలా మంది ఎమ్మెల్యేలపై స్థానికంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అది తెలిసి కూడా అతి విశ్వాసంతో అభ్యర్థుల్లో ఎలాంటి మార్పు చేయకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ సీట్లు కేటాయించారు. ఈ వ్యతిరేకత బీఆర్ఎస్‌కు కోలుకోలేని షాక్‌ని ఇచ్చింది.

ప్రచారంలో కాంగ్రెస్‌ను బీట్ చేయని బీఆర్ఎస్: ప్రచారం పరంగా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ బీట్ చేయలేకపోయిందనే ఒక టాక్ ఉంది. బీఆర్ఎస్ విడుదల చేసిన పాట, కొందరు సెలబ్రిటీలతో సోషల్ మీడియాలో రీల్స్ చేయించింది కానీ.. అవి ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. బీఆర్ఎస్ వీడియోలకు, పాటలకు కాంగ్రెస్ విడుదల కౌంటర్స్ ఇస్తూ.. పేరడీలను విడుదల చేస్తూ ప్రజలను ఇట్టే ఆకర్షించింది. ఇక కేసీఆర్ డూప్‌ మాదిరిగా ఉన్న వ్యక్తిని రంగంలోకి దించిన కాంగ్రెస్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు విడుదల చేయడం, యాడ్స్ ఇవ్వడంతో అవి ప్రజలను విపరీతంగా ఆకర్షించాయి. ప్రజల్లో ఆలోచనను రేకెత్తించాయి. వాటి ఎఫెక్ట్ కూడా ఎన్నికల ఫలితాలపై పడిందనే చెప్పుకోవాలి.

రేషన్ కార్డ్స్ ఇవ్వకపోవడం, కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడం, ఇతర ప్రభుత్వ పథకాలు అందకపోవడం వంటివి కూడా బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చని విశ్లేషిస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్‌లు.

మేనిఫెస్టో, పథకాలను సరిగా ప్రచారం చేయకపోవడం: వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి పథకాలే కొండంత బలం. కానీ, ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు తమ మేనిఫెస్టోని, పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారు. బీఆర్ఎస్ పథకాల కంటే ముందుగా.. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను ప్రకటించడం కూడా బీఆర్ఎస్ ఓటమికి కారణంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఈ స్థాయిలో బీఆర్ఎస్ తన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయింది. అంతేకాదు.. ఆ మేనిఫెస్టోలో పెద్దగా ఆకర్షణీయమైన పథకాలు కూడా లేకపోవడం బీఆర్ఎస్ ఓటమికి కారణంగా చెప్పుకోవచ్చు.

Also Read:

Telangana Elections: ‘ఈ తుపాకీ మిస్ ఫైర్ అయ్యింది’.. కేటీఆర్ ట్వీట్..

ISRO: ‘ఆదిత్య ఎల్‌ 1’లో రికార్డయిన సౌరగాలులు.. సోషల్‌ మీడియాలో ఇస్రో ఫోటో..

Advertisment
Advertisment
తాజా కథనాలు