ప్రస్తుతమున్న రోజుల్లో చాలామంది 8 నుంచి 10 గంటల పాటు కూర్చోని పనిచేస్తున్నారు. ఉద్యోగ, వ్యాపారరిత్యా ఇలా కూర్చోని పనిచేసే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. అయితే కూర్చోవడం కన్నా పడుకోవడమే మేలు అని పరిశోధకులు చెబుతున్నారు. ఆశ్చర్యంగా అనిపించిన ఇదే నిజం. ఇందుకు సంబంధించి పరిశోధకులు జరిపిన అధ్యయనం తాజాగా యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచూరితమైంది. ప్రస్తుతం పెద్దవారిలో బద్ధకం అనేది పెరిగిపోయిందని.. రోజుకు సగటున 9.30 గంటల సేపు అలా కదలకుండానే కూర్చుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీనికి బదులు నిలబడినా లేదా కనీసం పడుకున్నా కూడా గుండె ఆరోగ్యం మెరుగవుతుందని తెలిపారు. ఐదు దేశాల్లో జరిపిన ఆరు అధ్యయనాలను విశ్లేషించిన తర్వాత ఈ విషయాన్ని కనుగొన్నారు.
Also read: 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతే డేంజర్.. ఏమవుతుందో తెలుసా?
ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారిలో గుండె ఆరోగ్యం ఇంకా మెరుగ్గా ఉంటుందని.. ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే ఆరోగ్యానికి హాని చేస్తుందని పరిశోధకులు అంటున్నారు. దీనికి బదులుగా ఓ ఐదు నిమిషాల సేపు తీవ్రమైనా లేదా ఓ మాదిరి శ్రమ చేసినా మంచి ఫలితం కనిపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు దీనికి బదులు నిలబడినా, లేదా పడుకున్నా కూడా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని వివరిస్తున్నారు. కూర్చోవడానికి బదులు అరంగంట సేపు వ్యాయామం చేసిన 54 ఏళ్ల మహిళలో శరీర ఎత్తు, బరువు నిష్పత్తి 2.4 శాతం తగ్గినట్లు బయటపడింది. అలాగే నడుం చుట్టుకొలత 2.7 శాతం, రక్తంలో గ్లూకోజ్ 3.6 శాతం తగ్గాయి. అలాగే రోజూ వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు, రక్తంలో గ్లూకోజు, ఒంట్లో కొవ్వు, కొలెస్ట్రాల్ మోతాదులు కూడా తక్కువగా ఉంటాయి. అలాగే నిద్ర కూడా బాగా పడుతుంది. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేసేవేనని పరిశోధకులు వెల్లడించారు.
Also read: మలబద్ధకం సమస్య ఉందా.. ఇవి పాటిస్తే దెబ్బకు మాయం..!