Realme GT సిరీస్‌లో ప్రస్తుతం ప్రారంభించన మొబైల్ Realme GT 6T. ఈ మొబైల్ ప్రీమియం మిడ్-రేంజ్ సెగ్మెంట్‌పై దృష్టి పెట్టనుంది. ఈ మొబైల్ భారతదేశంలో Qualcomm 4nm స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 చిప్‌తో ప్రారంభించిన మొదటి స్మార్ట్‌ఫోన్ గా నిలిచింది. Realme తన GT 6T ఫోన్‌ను భారతదేశంలో మొత్తం 4 వేరియంట్‌లలో విడుదల చేసింది. ఈ ఫోన్ 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.30,999లతో 3 వేరియంట్‌లు 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్, 12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ 12GB RAM + 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ధరలు వరుసగా రూ.32,999, రూ.35,999 మరియు రూ.39,999. ఈ మొబైల్ మే 29 నుండి భారతదేశంలో విక్రయించబడుతుంది.
గ్రీన్,సిల్వర్ అనే 2 కలర్ ఆప్షన్లలో ఈ మొబైల్ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే, 6000నిట్‌ల వరకు లోకల్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్‌ని కలిగి ఉంది. పరికరం స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 చిప్‌సెట్‌తో ఆధారితమైనది, 12GB RAM మరియు 512GB అంతర్గత నిల్వతో జత చేయబడింది.