RBI: మనదేశంలో బ్యాంకింగ్ రంగం(Banking sector)లో రోజురోజుకు వ్రుద్ధి చెందుతుంది. ప్రజలు తమ సొమ్మును బ్యాంకుల్లో నిల్వ చేసేందుకు ఖాతాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు కంపెనీలు ఇఛ్చే జీతాన్ని బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని బ్యాంకు ఖాతాల ద్వారానే అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా మారింది. అయితే మన దేశంలో చాలా బ్యాంకులు ఉన్నాయి. చాలా మందికి అనేకు అవసరాల నేపథ్యంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్స్ ఉంటున్నాయి. ఎన్ని ఖాతాలు ఉంటే అన్ని ఖాతాలకు మినిమం బ్యాలెన్స్(Minimum balance) నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుంది.
అయితే మినిమం బ్యాలెన్స్ (Minimum balance)మెయిన్ టెయిన్ చేయనట్లయితే ఆయా బ్యాంకులు ఛార్జీల మోతా మెగిస్తుంటాయి. ఈనేపథ్యంలో రెండేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరపని ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ నిర్వహించనందుకు బ్యాంకులు జరిమానా విధించలేమని ఆర్బీఐ(RBI) తెలిపింది. ముఖ్యంగా ఆ స్కాలర్ షిప్ డబ్బు లేదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్స్ (Direct Benefit Transfer)స్వీకరించడం కోసం తీసుకున్న ఖాతాలను బ్యాంకులు రెండేళ్లకు పైగా ఉపయోగించకపోయినా అవి పనికిరానివిగా గుర్తించలేమని పేర్కొంది. ఆర్బీఐ తాజా నియమాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి:
ఆర్బీఐ తీసుకున్న ఈ కొత్త నిబంధన(New Testament) ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిమాణాన్ని తగ్గించేందుకు అలాంటి డిపాజిట్లను వారి నిజమైన యజమానులు, క్లెయిమ్ దారులకు తిరిగి ఇచ్చేందుకు బ్యాంకులు, ఆర్బీఐ చేపడుతున్న ప్రయత్నాలు , కార్యక్రమాలకు ఈ సూచనలు వర్తిస్తాయని భావిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంకులు తమ అకౌంట్స్ ఇన్ ఆపరేటివ్ గా ఉన్నాయని ఖాతాదారులకు ఎస్ఎంఎస్ లేదా ఈ మెయిల్ ద్వారా తెలిజేయాలి. పనిచేయాని అకౌంట్ యజమాని స్పందించని పక్షంలో ఖాతాదారుని పరిచయం చేసిన వ్యక్తం లేదా ఖాతాదారుని నామినీలను సంప్రదించాల్సి బ్యాంకులను తన సర్కుల్ర్ లో కోరింది ఆర్బీఐ.
మినిమం బ్యాలెన్స్ లేకుంటే బ్యాంకులు జరిమానా ఛార్జీలు విధించలేవు:
ఆపరేటివ్ అకౌంట్ గా వర్గీకరించిన ఏదైనా అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకుంటే బ్యాంకులు జరిమానా ఛార్జీలు విధించడానికి అనుమతించవు. పనిచేయని ఖాతాలను సక్రియం చేయడానికి ఎలాంటి ఛార్జీలు విధించకూడదని ఆ సర్క్యూలర్ నియమాల్లో పేర్కొన్నారు. ఈమధ్యే ఆర్బీఐ నివేదిక ప్రకారం అన్ క్లెయిమ్ చేయని డిపాజిట్లు 2023 మార్చి చివరి నాటికి రూ.32,934 కోట్ల నుంచి 28 శాతానికి పెరిగి రూ.42,272 కోట్లకు చేరినట్లు తెలిపింది. పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆపరేట్ చేయని డిపాజిట్ అకౌంట్లోని ఏదైనా బ్యాలెన్స్ బ్యాంకులు ఆర్బీఐ నిర్వహించే డిపాజిట్ , ఎడ్యుకేషన్ అవేర్ నెస్ ఫండ్ కు బదిలీ చేయాల్సి ఉంటుంది. మినిమమ్ బ్యాలెన్స్ లు నిర్వహించేందుకు పెనాల్టీ ఛార్జీలు విధించినందకు అకౌంట్స్ లో నిల్వలు ప్రతికూలంగా మారకుండా చూసుకోవాలని ఆర్బీఐ గతంలో బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడాచదవండి: రాజకీయ పార్టీలకు విరాళాల్లో మేఘా ఫస్ట్ ప్లేస్.. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికేనా?