RBI : ఆ 5 బ్యాంకులపై ఆర్బీఐ కఠిన చర్యలు...వాటిలో మీకు అకౌంట్ ఉందేమో ఓసారి చెక్ చేసుకోండి...!! మరో ఐదు బ్యాంకులపై RBI కొరఢా ఝులిపించింది. ద మన్‌మందిర్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ద లఖ్‌వద్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, కొంటాయ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సర్వోదయా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సంమిత్రా సహకారి బ్యాంక్ లిమిటెడ్ లపై చర్యలు తీసుకుంది. By Bhoomi 20 Dec 2023 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి RBI Imposes Monetary Penalty: దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థపై గట్టి నిఘాపెట్టింది ఆర్బీఐ. చిన్న తప్పు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటోంది. కొన్ని బ్యాంకులపై మానీటరీ ఫెనాల్టీలు విధిస్తుంది. కొన్ని బ్యాంకుల లైసెన్సులు రద్దు చేసేందుకు కూడా వెనకాడటం లేదు. తాజాగా మరో ఐదు బ్యాంకులు (5 Banks) దిమ్మతిరిగే షాకిచ్చింది ఆర్బీఐ. రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన క్రమంలో ఐదు కో ఆపరేటివ్ బ్యాంకులపై (Cooperative Banks) మానీటరీ పెనాల్టీలను విధించినట్లు స్పష్టం చేసింది. ఈ బ్యాంకుల జాబితాలో ద మన్‌మందిర్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ద లఖ్‌వద్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, కొంటాయ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సర్వోదయా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సంమిత్రా సహకారి బ్యాంక్ లిమిటెడ్ ఉన్నట్లు పేర్కొంది. ద మన్ మందిర్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పై రూ. 3లక్షల మానీటరీ పెనాల్టీని విధించింది ఆర్బీఐ. నో యువర్ కస్టమర్ డైరెక్షన్స్ 2016, మెయింటెనెన్స్ ఆఫ్ డిపాజిట్ అకౌంట్స్ ప్రైమరీ కో ఆపరేటివ్ బ్యాంకు ప్రకారం ఆర్బీఐ ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించిన కారణంగా ఈ పెనాల్టీ విధించినట్లు తెలిపింది. ఈ బ్యాంకుకు హై రిస్క్ కస్టమర్ల పీరియాడిక్ కేవైసీ (KYC) ఆప్ డేట్ చేయడంలో అలసత్వం వహించినట్లు వెల్లడించింది. అలాగే అకౌంట్ల రిస్క్ కేటగిరీలను సమీక్షించడంలో అలసత్వం గుర్తించినట్లు తెలిపింది. అలాగే ఇనాక్టివ్ అకౌంట్ల విషయంలో వార్షిక సమీక్ష కూడా చేయలేదని తెలిపింది. అటు ద లఖ్ వద్ నాగరిక్ సహకర బ్యాంకు పై రూ. 2లక్షల మానీటరింగ్ పెనాల్టీ విధించింది. గుజరాత్ మెహ్సానా జిల్లీ లఖ్ వద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంకు డైరెక్టర్లు, బంధువులకు లోన్లు అడ్వాన్సుల విషయంలో ఆర్బీఐ (RBI) ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు గుర్తించింది. ఈ బ్యాంకు డైరెక్టర్లలోని ఒకరి బంధువుకు లోన్ ఇచ్చినట్లు తెలుసుకుంది. ఫ్రుడెన్షియల్ ఇంటర్ బ్యాంక్ గ్రాస్ ఎక్స్ పోజర్ లిమిట్ కూడా ఉల్లంఘించినట్లు తెలిపింది. అలాగే కొంటాయ్ కో ఆపరేటివ్ బ్యాంకుపై రూ. 1లక్ష మానీటరీ పెనాల్టీ కూడా విధించింది. నో యువర్ కస్టమర్ డైరెక్షన్స్ 2016 మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు వెల్లడించింది. అటు సర్వోదయా కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ పై రూ 1 లక్షల మానీటరీ పెనాల్టీ వేసింది. ముంబై కేంద్రంలో పనిచేస్తున్న ఈ బ్యాంకు సూపర్ వైజరీ యాక్షన్ ఫ్రేమ్ వర్క్ కింద ఆర్బీఐ ఇచ్చిన మార్గదర్శకాలను పాటించలేదని వెల్లడించింది. సంమిత్రా సహకారి బ్యాంకుపై రూ 1లక్ష మానీటరీ పెనాల్టీ విధించింది. మెయింటెనెన్స్ ఆఫ్ డిపాజిట్ అకౌంట్స్ ప్రైమరీ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ ప్రకారం ఆర్బీఐ ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లించినట్లు గుర్తించడంతో పుణే కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంకుపై కూడా పెనాల్టీ వేసింది ఆర్బీఐ. ఇది కూడా చదవండి: పీరియడ్స్ నొప్పి భరించలేక…గర్భనిరోధక మాత్రలు వేసుకున్న బాలిక..ఎంత పనైంది..!! #rbi #rbi-penalty #reserve-bank-of-india #rbi-actions-on-banks మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి