Inflation: ద్రవ్యోల్బణం కాస్త ఉపశమనం కలగించింది.. కానీ.. : ఆర్బీఐ

భారత్ అధిక ధరల సవాళ్ల నుంచి బయటపడలేదని.. గత రెండు నెలల్లో ద్రవ్యోల్బణం కాస్త ఉపశమనం కలగించిందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. సెప్టెంబర్‌లో 5 శాతం ద్రవ్యోల్బణం నమోదు కాగా.. అక్టోబర్‌లో 4.9 శాతం నమోదైనట్లు పేర్కొంది.

New Update
RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతిదీ ట్రాక్!

దేశంలో ద్రవ్యోల్బణం గురించి 'రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా' కీలక వ్యాఖ్యలు చేసింది. అధిక ధరల సవాళ్ల నుంచి భారత్ ఇంకా బయటపడలేదని.. పేర్కొంది. అయితే గత రెండు నెలల్లో ద్రవ్యోల్బణం కాస్త ఉపశమనం కలగించినట్లు చెప్పింది. ‘స్టేట్‌ ఆఫ్‌ ది ఎకానమీ’ పేరిట గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో ఈ వ్యాఖ్యలు చేసింది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే విషయంలో ఇంకా పురోగతి సాధించాల్సి ఉందని తెలిపింది. అయితే సెప్టెంబర్‌లో 5 శాతం, అక్టోబర్‌లో 4.9 శాతంగా నమోదైనట్లు వివరించింది.
2022- 23లో 6.7 శాతం ద్రవ్యోల్బణం నమోదుకాగా.. 2023 జులై-ఆగస్టులో నమోదైన 7.1 శాతంతో పోలిస్తే గత రెండు నెలల్లో కాస్త ఉపశమనం లభించిందని తెలిపింది. కానీ నవంబరు 13 వరకు ఉన్న డేటా ప్రకారం చూసుకుంటే.. పప్పు దినుసులు, తృణధాన్యాల ధరలు పెరిగినట్ల చెప్పింది. మరోవైపు ఇదే సమయంలో వంట నూనెల ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వెల్లడించింది.

Also Read: అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వాయిస్‌తో రూ.1.4 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు..

అలాగే భారత వృద్ధి దేశీయ గిరాకీపైనే ఆధారపడి ఉందని.. దీంతో బహిర్గత అంశాల ప్రభావం స్వల్పంగా ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. నియంత్రిత ప్రస్తుత ఖాతా లోటు, బలమైన నగదు ప్రవాహం ఉందని.. అలాగే స్థిరమైన కరెన్సీ, తగినంత విదేశీ మారక నిల్వలు ఉండటంతో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉన్నట్లు పేర్కొంది. పండగ సీజన్‌లో నమోదైన బలమైన గిరాకీ వల్ల అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసికంలో బలమైన వృద్ధి రేటు నమోదవుతుందని భావిస్తోంది. మరోవైపు పెట్టుబడులు, మౌలిక వసతుల్లో ప్రభుత్వం వ్యయం, డిజిటలైజేషన్‌ వంటి అంశాలు కూడా దేశ వృద్ధి రేటు వైపు వెళ్లేందుకు దోహదం చేస్తాయని చెప్పింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు