RBI New Rule: ఆర్బీఐ కొత్త రూల్.. ఇక క్రెడిట్ కార్డ్.. పర్సనల్ లోన్ సరదా తీర్చేస్తాయి..

ఆర్బీఐ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల రిస్క్ వెయిటేజ్ ను 100% నుంచి 125%కి పెంచింది. ఇందువల్ల క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ ఇప్పటికే తీసుకున్నవారికి.. కొత్తగా తీసుకునేవారికి వడ్డీరేట్లు భారంగా మారతాయి.

New Update
RBI New Rule: ఆర్బీఐ కొత్త రూల్.. ఇక క్రెడిట్ కార్డ్.. పర్సనల్ లోన్ సరదా తీర్చేస్తాయి..

RBI New Rules on Loans: ఇప్పటికే మీకు క్రెడిట్ కార్డ్ (Credit Card).. పర్సనల్ లోన్ ఉందా.. లేకపోతే కొత్తగా వీటిని తీసుకోవడానికి చూస్తున్నారా? అయితే, ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే, బ్యాంకులకు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFC) లకు ఆర్బీఐ కొత్త రూల్ తీసుకువచ్చింది. ఆర్బీఐ (RBI) తీసుకువచ్చిన రూల్ తెలుసుకునే ముందు.. బ్యాంకులు క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ ఇవ్వాలంటే ఆర్బీఐ ఎలా అనుమతి ఇస్తుంది అనే విషయం చెప్పుకుందాం.

ఏదైనా బ్యాంక్ నుంచి మీరు లక్ష రూపాయలు పర్సనల్ లోన్ (Personal Loan) తీసుకుంటే.. ఆ బ్యాంక్ మన లోన్ తరఫున ష్యురీటీని ఆర్బీఐకి చూపించాలి. అదేమిటి? అనే అనుమానం వస్తోంది కదా. అవును.. మీరు లక్ష రూపాయలు లోన్ తీసుకుని ఒకవేళ బ్యాంకుకు తిరిగి కట్టలేకపోతే.. బ్యాంకు డిపాజిటర్ల సొమ్ము నష్టపోకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు. అంటే ఒకవేళ లోన్ తీసుకున్న వారు డబ్బు చెల్లించకపోయినా బ్యాంక్ కార్యకలాపాలు ఆగిపోయే పరిస్థితి ఉండకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. దీనినే రిస్క్ వెయిటేజ్ అంటారు. ఇంకొంచెం వివరంగా దీని గురించి తెలుసుకుందాం..

Also Read: బంగారం కొనేముందు ఇవి తెలుసుకుంటున్నారా.. లేదంటే మోసపోతారు

రిస్క్ వెయిటేజ్ అంటే.. మనం సాధారణ మాటల్లో చెప్పుకుంటే.. మీరు లక్ష రూపాయలు లోన్ బ్యాంక్ నుంచి తీసుకుంటే.. బ్యాంక్ మరో లక్ష తన దగ్గర క్యాపిటల్ గా చూపించాలి. అంటే ఒక బ్యాంకు పది లక్షల రూపాయల పర్సనల్ లోన్స్ ఇస్తే కనుక పది లక్షల రూపాయలను దానికి వ్యతిరేకంగా క్యాపిటల్ ఫండ్ లో ఉంచాలి. దీనిని విడిగా చూపించాలి అందుకోసం ప్రభుత్వ బండ్లలో ఆమేరకు పెట్టుబడి పెట్టాలి.

ఇప్పుడు ఆర్బీఐ తీసుకువచ్చిన రూల్(RBI New Rule) గురించి చూద్దాం. ఇప్పటివరకూ రిస్క్ వెయిటేజ్ 100%గా ఉండేది దీనిని ఇప్పుడు 25 బేసిస్ పాయింట్లు పెంచి 125%కి తీసుకువచ్చింది. ఇది పర్సనల్ లోన్స్ కి, క్రెడిట్ కార్డులకు వర్తిస్తుంది. అయితే, హోమ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ కి ఇది వర్తించదు. అంటే ఇంతవరకూ ఏదైనా బ్యాంక్ పదిలక్షల రూపాయల లోన్స్ ఇచ్చింది అనుకుందాం. అప్పుడు ఇప్పుడు 125% రిస్క్ వెయిటేజ్ (Risk weights) పెంచడం వలన బ్యాంకులు పది లక్షల లోన్స్ ఇస్తే కనుక అది 12,50,000 రూపాయల ప్రభుత్వ బాండ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే తమ ప్రొవిజన్ పెంచుకోవాల్సి ఉంటుంది.

ఆర్బీఐ ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం వాణిజ్య బ్యాంకుల వినియోగదారుల రుణంపై రిస్క్ వెయిటేజీ ఇప్పటివరకు 100% ఉండగా, ఇప్పుడు 25 బేసిస్ పాయింట్లు పెంచి 125%కి పెంచింది. పాత, కొత్త లోన్స్ రెండింటికీ ఇది వర్తిస్తుంది. ఇందులో పర్సనల్ లోన్స్ ఉంటాయి. కానీ హోమ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, వెహికిల్ లోన్స్ ఉండవు. అలాగే బంగారం లేదా బంగారు ఆభరణాలకు బదులుగా సెక్యూర్ చేసిన లోన్స్ మినహా క్రెడిట్ కార్డు లోన్స్, పర్సనల్ లోన్స్ వంటి అన్ని అన్ సెక్యూర్డ్ లోన్స్ ఖరీదైనవిగా మారతాయి. ఇప్పుడు బ్యాంకులు - ఎన్బిఎఫ్సిలు వినియోగదారుల రుణాలు ఇవ్వడానికి ఎక్కువ ప్రొవిజనింగ్ చేయవలసి ఉంటుంది.

Also Read: రూపాయి పెట్టుబడి లేకుండా…లక్షల్లో ఆదాయం..యువతకు బెస్ట్ బిజినెస్ ఐడియాలివే..!!

వాస్తవానికి, కొన్ని వ్యక్తిగత రుణ విభాగాల్లో పెరుగుతున్న రిస్క్ గురించి ఆర్బిఐ గవర్నర్ అక్టోబర్ మానిటరీ పాలసీలో హెచ్చరించారు. ఆర్బీఐ ఈ కఠినమైన రూల్స్ ఆ దిశగా వేసిన అడుగు. బ్యాంకులతో పాటు ఎన్బీఎఫ్సీల రుణాలపై క్రెడిట్ రిస్క్ వెయిటేజీని ఆర్బీఐ 100 శాతం నుంచి 125 శాతానికి పెంచింది. ఈ రిటైల్ లోన్లో హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, వెహికల్ లోన్, బంగారంపై లోన్ ఉండవు. అలాగే, కొత్త ఆర్ బిఐ మార్గదర్శకాల ప్రకారం వాణిజ్య బ్యాంకుల క్రెడిట్ కార్డుల రిస్క్ వెయిటేజీ 100% నుంచి 150%కి పెంచారు. ఎన్ బిఎఫ్ సిల క్రెడిట్ కార్డ్ రుణాలపై రిస్క్ వెయిటేజీ 125%గా ఉంటుంది.

ఇప్పుడు ఈ రూల్స్ వల్ల క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్ ఉన్నవారికి.. కొత్తగా తీసుకునే వారికీ బ్యాంకులు వడ్డీరేట్లు మరింత పెంచుతాయి. అందువల్ల ఈ లోన్స్ ఖరీదైనవిగా మారతాయి.

Watch this interesting video:

Advertisment
తాజా కథనాలు