UPI Payments : జనవరి 1 నుంచి మారిన యూపీఐ కొత్త రూల్స్ ఇవే...

 మీరు యూపీఐ వాడుతున్నారా...అయితే వాటి నిబంధనలు మారాయి చూసుకోండి. జనవరి 1 నుంచి ఆర్బీఐ యూపీఐ పేమెంట్ అకౌంట్ నిబంధనలను మార్చింది. రూల్స్ ప్రకారం అప్డేట్ చేసుకోని వారి అకౌంట్‌లు రద్దు అయిపోతాయని కూడా హెచ్చరిస్తోంది.

UPI Payments : జనవరి 1 నుంచి మారిన యూపీఐ కొత్త రూల్స్ ఇవే...
New Update

UPI Payments : కరోనా(Corona) తర్వాత యూపీఐ పేమెంట్స్‌(UPI Payments) కు జనాలు బాగా అలవాటు పడిపోయారు. చిన్న చిన్న మనీ ట్రాన్సాక్షన్స్ దగ్గర నుంచి పెద్ద వాటి వరకూ అందరూ దీని మీదనే ఆధారపడుతున్నారు. క్రెడిట్ కార్డుల వినియోగం ఎక్కువే ఉన్నా డెబిట్ కార్డులు, డబ్బలను మాత్రం చాలా తక్కువగా యూజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు యూపీఐ వాడే వాళ్ళందరూ అలర్ట్‌గా ఉండాలని సూచిస్తోంది ఆర్బీఐ (RBI). యూపీఐ అకౌంట్ల విషయంలో రూల్స్ మారాయని హెచ్చరిస్తోంది.

Also Read:టీఎస్పీఎస్సీపై రేవంత్‌ రివ్యూ.. నోటిఫికేషన్ల విడుదలపై కీలక నిర్ణయం?

గూగుల్ పే (Google Pay), పేటీఎం, ఫోన్ పే (Phone Pe) ఇలా ఏది వాడుతున్నా... మీరు మీ అకౌంట్లను ఎప్పుడూ యాక్టివ్‌లో ఉండేటట్లు చూసుకోండని చెబుతోంది ఆర్బీఐ. ఏడాది కంటే ఎక్కువ కాలం యాక్టివ్‌గా లేని యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయాలని బ్యాంకులను కోరింది. ఇక దీంతో పాటూ వినియోగదారులకు మరో శుభవార్త కూడా చెప్పింది. ఎన్‌పీసీఐ (NPCI) ప్రకారం యూపీఐ ట్రాన్సాక్షన్ల ద్వారా ఇప్పటి వరకు గరిష్ట చెల్లింపు పరిమితి పెరిగింది. ఇప్పుడు లక్ష వరకు చెల్లింపులు చేసుకోవచ్చును. దీంతో పాటూ ఆసుపత్రులు, విద్యాసంస్థలకు అయితే ఈ పరిమితిని ఐదు లక్షల వరకు పెంచింది. డిసెంబర్ ఎనిమిది నుంచి ఈ రూల్ అమల్లోకి వచ్చిందని తెలిపింది.

ఇక ఆన్ లైన్ నేరాలును అరికట్టేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది ఆర్బీఐ. దీని ప్రకారం యూపీఐ, ఫోన్ పై ఇలా దేని ద్వారా అయినా ఒక కొత్త నంబర్‌కు యూపీఐ ట్రాన్సాక్షన్ కనుక చేస్తుంటే...అది రెండువేల కంటే ఎక్కువ ఉంటే కనుక ఆ నగదు వెళ్ళేందకు నాలుగు గంటల సమయం పట్టనుంది. అయితే ఈ రూల్ ఇంకా అమల్లోకి రాలేదు. అది ఎప్పటి నుంచి వస్తుందనేది ఆర్బీఐ కూడా ఇంకా స్పష్టం చేయలేదు.

#rbi #money #online #phone-pe #payments #google-pay #upi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe