RBI: అలా చేసినందుకు నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ..

రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను ఉపక్రమిస్తున్న బ్యాంకులకు ఆర్బీఐ చుక్కలు చూపిస్తోంది. లైసెన్స్‌లు రద్దు చేయడం, భారీగా జరిమాన విధించడం లాంటివి చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మరో నాలుగు బ్యాంకులపై జరిమాన విధించింది. ఇప్పటికే చాలావరకు కో-ఆపరేటివ్ బ్యాంకులు ఆర్‌బీఐ మార్గదర్శలకు పెడచెవిన పెట్టాయి. అందుకోసమే ఆర్‌బీఐ ఈ విషయాల పట్ల సిరీయస్ అయింది. అందుకే లైసెన్స్ రద్దు చేయడం లేదా భారీ జరిమానాలు విధించడం లాంటివి చేస్తోంది.

New Update
RBI: అలా చేసినందుకు నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ..

Reserve Bank of India: గత కొన్ని రోజులుగా చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. నిబంధనలను ఉల్లంఘిస్తున్న బ్యాంకులపై కొరడా ఝళిపిస్తోంది. వాటి లైసెన్స్‌లు రద్దు చేయడం, భారీగా జరిమాన విధించడం లాంటివి చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మరో నాలుగు బ్యాంకులపై జరిమాన విధించింది. ఆర్బీఐ జరిమాన వేసినటువంటి బ్యాంకుల జాబితాలో గుజరాత్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (Gujarat Mercantile Bank), నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్ (Nagarik Sahakari Bank), మకరపురా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ & ది సెవలియా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి.

Also Read: సిసోడియాను అలా జైల్లో ఉంచలేం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఇక వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి గుజరాత్ మార్కంటైల్ కో ఆపరేటీవ్ బ్యాంక్ డిపాజిట్ ప్లేస్‌మెంట్‌కు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించింది. అలాగే క్యాష్ రిజర్వ్ రేషియో మెయింటెనెన్స్‌కు సంబంధించి కూడా రూల్స్ పాటించకపోవడంతో ఆర్‌బీఐ ఏకంగా రూ.4.50 లక్షల జరిమాన విధించింది. ఇక గుజరాత్‌లోని బాబ్రా కేంద్రంగా పని చేస్తున్న నాగరిక్ సహకారి బ్యాంకు కూడా నిబంధలను అతిక్రమించింది. బ్యాంకింగ్ రెగ్యులేటరీ యాక్ట్ - 1949లోని కొన్ని ఆర్‌బీఐ మార్గదర్శకాలను పాటించనందును రూ.2 లక్షల ఫైన్ వేసింది.

మరోవైపు.. ఆర్‌బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించడం.. అలాగే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌కు పంపాల్సిన డబ్బును పంపకపోవడంతో మకరపురా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు రూ. 2 లక్షలు ఫైన్ పడింది. ఇక ది సెవాలియా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు (Sevalia Urban Co-operative Bank)కు ఆర్‌బీఐ రూ.50,000 జరిమానా వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను పాటించకపోవడం వల్లే జరిమాన విధించడానికి ప్రధాన కారణమని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే చాలావరకు కో-ఆపరేటివ్ బ్యాంకులు ఆర్‌బీఐ మార్గదర్శలకు పెడచెవిన పెట్టాయి. అందుకోసమే ఆర్‌బీఐ ఈ విషయాల పట్ల సిరీయస్ అయింది. అందుకే లైసెన్స్ రద్దు చేయడం లేదా భారీ జరిమానాలు విధించడం లాంటివి చేస్తోంది. అందుకే ఒక వ్యక్తి.. ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా లేదా డబ్బు డిపాజిట్ చేసేముందు ఆ బ్యాంకు ఆర్ధిక స్థితిగతులను పరిశీలించడం మంచింది.

Advertisment
తాజా కథనాలు