ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక బ్యాంక్‌పై కఠిన ఆంక్షలు కూడా విధించి.. మరో బ్యాంక్‌కు షాకిచ్చి.. కొన్ని ఆంక్షలు విధించింది. దీంతో బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని వారు చెప్పుకోవచ్చారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల నేపథ్యంలో బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారు లిమిట్‌కు మించి ఇకపై డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం కుదరదని చెప్పింది. ఇంతకీ ఏ బ్యాంక్‌కు ఆర్‌బీఐ కఠిన అంక్షలు విధించింది..? కొత్త నిబంధనలు ఏంటివి..? అనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా అహ్మదాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కలర్ మర్చంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. కఠిన ఆంక్షలు కూడా ఈ బ్యాంక్‌పై తీసుకువచ్చింది. ప్రతికూల అంశంగా బ్యాంక్ క్యాష్ విత్‌డ్రాయెల్‌పై పరిమితులు అమలులోకి వచ్చాయని చెప్పింది.
కఠిన ఆంక్షలు అమలులోకి
బ్యాంక్ కస్టమర్లు ఇకపై వారి అకౌంట్ నుంచి రూ. 50 వేలకు మించి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం కుదరదని ఆర్బీఐ చెప్పింది. బ్యాంక్ ఆర్థిక స్థితి ఆశాజకనంగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చామని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పుకోవచ్చు. అయితే ఆర్‌బీఐ విధించిన ఆంక్షలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. ఈ ఆంక్షలు సెప్టెంబర్ 25 నుంచి వచ్చే 6 నెలల కాలం వరకు అమలులో ఉంటాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. ఈ ఆంక్షల నేపథ్యంలో.. ఈ బ్యాంక్ ఇకపై ఆర్బీఐ అనుమతి లేకుండా ఎలాంటి లోన్స్, లోన్స్ రెన్యూవల్ కూడా చేయకూడదు.
పనితీరుపై ఎప్పటికప్పుడు ఆర్‌బీఐ నిఘా
అలాగే.. ఇన్వెస్ట్‌మెంట్లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోకూడదు.. కస్టమర్ల నుంచి కొత్త డిపాజిట్లు స్వీకరించొద్దని తెలిపింది. ఇకపైనా రూ.50 వేలకు మించి కస్టమర్లు అన్ని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లు, కరెంట్, ఇతర అకౌంట్లలోని డబ్బులను విత్‌డ్రా చేసుకోలేరు. అంటే ఎన్ని అకౌంట్లు ఉన్నా..!! మొత్తంగా రూ. 50 వేలకు మించి డబ్బులు విత్‌డ్రా చేసుకువడం వీలు కాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆంక్షలు విధించినా... కూడా బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగుతాయని ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఆంక్షల సడలింపుతో పాటు.. బ్యాంక్ ఆర్థిక స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటామని ఆర్బీఐ వెల్లడించింది. బ్యాంక్ కస్టమర్లు ఏవిధంగా చింతించాల్సిన పని లేదని ఆర్బీఐ వెల్లడించింది. మరో వైపు డిపాజిట్.. ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ, కార్పొరేషన్ (డీఐసీజీసీ) కింద రూ .5 లక్షల వరకు బ్యాంక్ కస్టమర్లకు లభిస్తాయి. బ్యాంక్‌లో డబ్బు కలిగిన వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. గరిష్టంగా రూ. 5 లక్షల వరకు పొందొచ్చు. అయితే రూ. 5 లక్షలకు పైగా బ్యాంక్ డిపాజిట్లు కలిగి ఉంటే మాత్రం నష్టపోవాల్సి ఉంటుంది. దేశంలోని బ్యాంకుల పనితీరుపై ఎప్పటికప్పుడు ఆర్‌బీఐ నిఘా పెడుతోంది. ఏ బ్యాంకైనా రూల్స్ అతిక్రమించినా..పెనాల్టీలతో పాటు లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఆర్బీఐకి ఉంది. గతంలో చిన్న చిన్న బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు రూల్స్ అతిక్రమించిన కొన్నింటిపై భారీగా పెనాల్టీతో పాటు.. కొన్నింటి లైసెన్సులు రద్దు చేసింది.