భారత క్రికెట్ టీమ్‌కు భవిష్యత్తు క్రికెటర్లు దొరికారా..? ఈ యంగ్ బ్యాటర్లు ఆ స్థానాల్లో రాణించగలరా..? విండీస్ టూర్‌లో ఆరంగ్రేటం చేసిన ఆటగాళ్లు రాబోయ్యే ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొనే భారత జట్టులో స్థానం సంపాదిస్తారా..? సెలక్టర్ల మనస్సులో ఉంది ఏంటి.? యంగ్ ప్లేయర్లను పక్కన పెట్టబోతున్నారా..? వీరి మీద ఇంకా నమ్మకం కలగలేదని చెప్పుకోవచ్చా.. అద్భుత ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లను బీసీసీఐ తొక్కిపడేస్తుందనే చెప్పుకోవచ్చా..
భారత క్రికెట్ టీమ్‌కు ఐపీఎల్ ద్వారా ట్యాలెంట్ ఉన్న యంగ్ క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి విదేశీ గడ్డపై ఆరంగ్రేటం చేసిన యంగ్ బ్యాటర్లు తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ సత్తా చాటారు. విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తిలక్ వర్మ వరుసగా 39, 50, 49 పరుగులతో రాణించి తానేంటో నిరూపించగా.. యశస్వి జైస్వాల్ శనివారం జరిగిన నాలుగో టీ20లో కేవలం 51 బంతుల్లోనే 84 పరుగులతో అదరగొట్టాడు. దీంతో ఈ ఇద్దరు యంగ్ బ్యాటర్లు స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం రాణించగలమని చెప్పకనే చెప్పారు. దీంతో భారత క్రికెట్‌కు రానున్న రోజుల్లో ఈ ఇద్దరు ప్లేయర్లు దిగ్గజ క్రికెటర్లుగా మారుతారని మాజీలు అంటున్నారు. ఇంతకు ముందు విండీస్ గడ్డపై ఆడిన అనుభవం లేని ఈ బ్యాటర్లు సునాయసంగా బౌండరీలు కొట్టడం భారత్ జట్టుకు శుభపరిణామమన్నారు. వారిని సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ టూర్‌కు ఎంపిక చేస్తే, జీవం ఉన్న పిచ్‌లపై ఆడితే వీరిలో ఉన్న ట్యాలెంట్ స్పష్టంగా తెలుస్తోందని భావిస్తున్నారు.
మరోవైపు ఈ బ్యాటర్లను ఈ నెలలో పాకిస్థాన్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న ఆసియా కప్‌కు ఎంపిక చేయాలనే డిమాండ్‌లు సైతం వస్తున్నాయి. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో వారికి అవకాశం ఇస్తే వన్డే ఫార్మాట్‌లో సైతం యంగ్ బ్యాటర్లు సత్తా చాటగలరని మాజీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారు వన్డే ప్రపంచకప్‌కు సైతం ఎంపికయ్యే అవకాశం కూడా ఉంది.
కాగా ప్రస్తుతం ఈ ఇద్దరు బ్యాటర్లు టీ20 ఫార్మాట్లో మాత్రమే ఆరంగ్రేటం చేయడంతో వీరిని అప్పుడే వన్డేలకు ఎంపిక చేయడం కుదరదని, అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌కు అలవాటు కావాలని, పొట్టి క్రికెట్‌లా వన్డేలో ప్రతీ బాల్ బౌండరీకి తరలించవద్దని, 50 ఓవర్ల మ్యాచ్‌లో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని బీసీసీఐ బావిస్తున్నట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా రాబోయ్యేవి రెండు పెద్ద టోర్నీలు. ఆసియా కప్ టోర్నీలో 6 దేశాలు పాల్గొననుండగా.. స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో 10 దేశాలకు చెందిన టీమ్‌లు పాల్గొననున్నాయి. ఈ టోర్నీలో ప్రపంచంలోనే మేటీ బౌలర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌కు సీనియర్లను ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో యంగ్ ప్లేయర్లు పెద్ద టోర్నీలో పాల్గొనేందుకు ఇంకా సమయం పడుతుందనే చెప్పాలి. మరోవైపు టీమ్ ఇండియా ఎప్పటి నుంచి 4వ స్థానంలో సరైన బ్యాటర్ లేక సతమతమవుతోంది. విండీస్‌తో జరిగురుతున్న టీ20 సిరీస్‌లో 4వ స్థానంలో బ్యాంటిగ్‌కు వచ్చి తిలక్ వర్మ రాణించాడు. అతనితో పాటు సూర్య కుమార్ యాదవ్ సైతం 4వ స్థానంలో మంచి ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ టీమ్‌లో వీరిని ఎంపీక చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.