Onion Benifits: ''ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు'' అంటారు ఎందుకో తెలుసా!

పచ్చి ఉల్లిపాయలను ప్రతిరోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడంతో పాటు, గుండె సంబంధిత వ్యాధులను రాకుండా కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Onion Benifits: ''ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు'' అంటారు ఎందుకో తెలుసా!
New Update

ఉల్లిపాయ (Onion) లేని కూరలను ఊహించగలమా..అది ఇప్పుడు సాధ్యమే అంటున్నారు..ఎందుకంటే గత కొంతకాలంగా ఉల్లి రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. దాంతో చాలా మంది ఉల్లి లేకుండా కూరలు వండడం అలవాటు చేసుకుంటున్నారు. ఇప్పుడంటే ఉల్లి ధరల వల్ల ఉల్లిని తినడం తగ్గిస్తున్నారు కానీ..ఇంతకు ముందు పెరుగన్నంలో కూడా పచ్చి ఉల్లిపాయ తినేవారు.

అందుకే మన పూర్వీకులు చాలా ఆరోగ్యంగా (Healthy) ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ చాలా మంది పచ్చళ్లలో పచ్చి ఉల్లిపాయలను ముక్కలుగా కోసి కలుపుతుంటారు. ఇలా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే పెద్దలు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు.

ఉల్లిపాయలో ఉండే క్వెర్సింటిన్‌ అనేది శరీరానికి చాలా మేలు చేస్తుందంట. రక్తపోటును (High Bp) నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది. శరీరంలో వచ్చే వివిధ రకాల మంటలను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉల్లిపాయ ఎంతో సహాయపడుతుంది.

శరీరంలో వచ్చే అలెర్జీ లక్షణాలను కూడా తగ్గించే శక్తి ఉల్లికి ఉంది. పచ్చి ఉల్లిపాయను ప్రతిరోజూ భోజనంలో తినడం వల్ల ఇమ్యునిటీ పవర్‌ ను పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయలో అనేక రకాల విటమిన్లు , మినరల్స్‌ ఉన్నాయి. విటమిన్‌ సి, విటమిన్‌ బీ6, కాల్షియం, ఫైబర్‌, ఐరన్‌, పొటాషియం, మాంగనీస్‌, పాస్పరస్‌ కూడా ఇందులో ఉంటాయి.

ఉల్లిపాయలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపస్తుంది. ఉల్లిపాయలోని సల్ఫర్‌ లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. చాలా మంది యువత ఉల్లి తింటే వాసన వస్తుందన్న ఉద్దేశంతో దీన్ని దూరం పెడుతుంటారు కానీ..ఉల్లి తింటే మొటిమలు, చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిపోతాయి. శరీరంలోని క్యాన్సర్‌ కారకాలను ఉల్లి అడ్డుకుంటుంది.

ఉల్లి పాయలు కొవ్వు స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. దీని వల్ల స్ట్రోక్‌ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు ఎవైనా ఉంటే వెంటనే పచ్చి ఉల్లిపాయలను తినడం అలవాటు చేసుకోవాలి.అంతేకాకుండా రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది.

దీని వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టడం జరగదు. గుండె పై ఒత్తిడి తగ్గుతుంది. ఇలా నిత్యం చేస్తూ ఉంటే గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షుగర్‌ పేషెంట్లకు ఇన్ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరంలో రోగనిరోధక శక్తి రోజురోజుకు బలహీనంగా తయారవుతుంది..కాబట్టి ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయలను భోజనంలో భాగంగా చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు అనేక ఇన్ఫెక్షన్లను కూడా పొగొడుతుంది.

Also read: ఆఫీసులో పొరపాటున ఇలా చేయకండి.. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు!

#health #lifestyle #onion #benifits
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe