RaviTeja : మాట నిలబెట్టుకున్న మాస్ రాజా.. అభిమానికి సినిమాలో ఛాన్స్!

New Update
RaviTeja : మాట నిలబెట్టుకున్న మాస్ రాజా.. అభిమానికి సినిమాలో ఛాన్స్!

Amardeep In Ravi Teja Movie : టాలీవుడ్(Tollywood) మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) టాలెంట్ ఉండే ఆర్టిస్టులను, టెక్నీషియన్స్ ని ఎంతలా సపోర్ట్ చేస్తాడో తెలిసిందే. ఎందుకంటే ఆయన కూడా బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలెంట్ తోనే ఇండస్ట్రీకి వచ్చి హీరోగా ఎదిగాడు. రవితేజ ఇప్పటిదాకా ఎంతో మంది టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసాడు.

ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్న హరీశ్ శంకర్, బాబీ, గోపీచంద్ మలినేని.. ఇంకా చాలా మందికి రవితేజ ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈసారి అభిమానికి తన సినిమాలో అవకాశం కల్పించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.

Also Read : అరుదైన గౌరవం అందుకున్న అతిలోక సుందరి.. ముంబైలోని ఆ ఏరియాకు శ్రీదేవి పేరు!

మాట నిలబెట్టుకున్న మాస్ రాజా

బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss Season 7) తో పాపులర్ అయిన అమర్ దీప్(Amardeep) రవితేజకు ఎంత పెద్ద ఫ్యానో అందరికి తెలిసిందే. ఇదే విషయాన్ని అమర్ చాలా సందర్భాల్లో చెప్పాడు. అయితే బిగ్ బాస్ 7 లో గెస్ట్ గా వచ్చిన రవితేజ అమర్ అభిమానానికి ఫిదా అయి.. అతనికి తన సినిమాలో కచ్చితంగా ఛాన్స్ ఇస్తానని అందరి ముందే చెప్పాడు. దాంతో అమర్ చాలా సంతోషించాడు. ఎమోషనల్ కూడా అయ్యాడు. ఎట్టకేలకు రవితేజ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.

అమర్ దీప్ తాజాగా రవితేజను కలుసుకున్న ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసాడు. ఫైనల్ గా నా కల నెరవేరిందని, రవితేజతో కలిసి నటించే ఛాన్స్ వచ్చిందని తెలిపాడు. ప్రస్తుతం అమర్ షేర్ చేసిన ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చుసిన మాస్ రాజా ఫ్యాన్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని రవితేజపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా రవితేజ ప్రెజెంట్ మిస్టర్ బచ్చన్ తో పాటూ మరో కొత్త దర్శకుడితో తన 75 వ సినిమా చేస్తున్నారు. ఈ రెండింటిలో అమర్ దీప్ కి ఏ సినిమాలో అఫర్ వచ్చిందో తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు