Ashwin : స్పిన్‌ చాణక్యుడి ఖాతాలో అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్‌గా ఘనత!

టీమ్ ఇండియా స్పిన్ మాయజాలం రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. రాంచీ వేదికగా ఇంగ్లాండుతో జరుగుతున్న నాలుగో టెస్టులో జానీ బెయిర్ స్టోను అవుట్ చేసి ఒకే జట్టుపై 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా అవతరించాడు.

Ashwin : స్పిన్‌ చాణక్యుడి ఖాతాలో అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్‌గా ఘనత!
New Update

IND vs ENG : భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin) మరో అరుదైన ఘనత సాధించాడు. ఓకే జట్టుపై 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ మేరకు ఇంగ్లాండ్(England) తో రాంచీ వేదికగా జరుగుతున్న 4వ టెస్టులో జానీ బెయిర్ స్టోను ఎల్బీ డబ్ల్యూ చేసిన అశ్విన్ ఈ అరుదైన ఘనత సాధించాడు.

తొలి బౌలర్..

ఈ మేరకు రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ 21వ ఓవర్‌లో బెయిర్‌ స్టో వికెట్ తీసి ఈ ఘనత దక్కించుకున్నాడు. దీంతో 23 టెస్టు మ్యాచ్‌ల్లో ఒకే టీమ్ పై 100 వికెట్ల మార్క్‌ చేరుకున్నాడు. అంతేకాదు భారత్‌(India), ఇంగ్లాండ్‌ మధ్య టెస్టుల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌ కూడా అశ్వినే కావడం విశేషం. కాగా అశ్విన్ కంటే ముందు జేమ్స్‌ అండర్సన్‌ టీమ్‌ఇండియాపై 35 టెస్టుల్లో 139 వికెట్లు తీశాడు. అంతేకాదు.. టెస్టుల్లో ఒక దేశంపై 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గానూ రికార్డ్‌ సాధించాడు. అలాగే స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా అశ్విన్‌ కొనసాగుతున్నాడు. అనిల్ కుంబ్లే 63 మ్యాచ్‌ల్లో 350 వికెట్లతో ముందున్నాడు. ప్రస్తుతం 58 టెస్టుల్లో 349 వికెట్లు తీసిన అశ్విన్‌ మరో 2 వికెట్లు పడగొడితే కుంబ్లే రికార్డ్ బ్రేక్ చేస్తాడు.

ఇది కూడా చదవండి : Siddique: పది కేజీలు తగ్గితేనే కలుస్తానన్నాడు.. రాహుల్ గాంధీపై జీషాన్ విమర్శలు!

7వ బౌలర్‌గా మరో ఘనత..

ఇదిలావుంటే మొత్తం క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన 7వ బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. జార్జ్‌ గిఫెన్‌, మోనీ నోబెల్‌, విల్‌ఫ్రెడ్‌ రోడ్స్‌, గార్‌ఫీల్డ్‌ సోబెర్స్‌, ఇయాన్‌ బోథమ్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ ఈ ఫీట్‌ సాధించిన వారిలో ముందంజలో ఉన్నారు. ఇక ఈ టెస్టులో వెంట వెంటనే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను జో రూట్‌ అర్ధ శతకంతో ఆదుకున్నాడు. క్రీజులో పాతుకుపోయి రూట్ 108 బంతుల్లో 50 పరుగులు చేశాడు. టెస్టుల్లో భారత్‌పై ఎక్కువ సార్లు అర్ధ శతకాలు (20) సాధించి రికీ పాంటింగ్‌ సరసన నిలిచాడు. ఆసియా పిచ్‌లపై గత 19 ఇన్నింగ్స్‌లో రూట్‌కు ఇది రెండో హాఫ్‌ సెంచరీ కాగా.. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 49 ఓవర్లకు 176/5 స్కోర్ తో ఆట కొనసాగిస్తుంది.

#england #ravichandran-ashwin #india #100-wickets
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe