Dhawan : ధావన్‎కి అన్యాయం జరిగింది..టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్..!!

టీమిండియాలో స్టార్ ఓపెనర్ గా తన ప్రస్తానాన్ని ప్రారంభించి అద్భుతమైన ఆటతీరుతో జట్టును ఎన్నోసార్లు విజయతీరాలకు చేర్చాడు శిఖర్ ధావన్. అయితే కొంతకాలం నుంచి అతను కేవలం కొన్ని మ్యాచ్‌లకే మాత్రమే పరిమితమయ్యాడు. డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్ తో చివరి వన్డే సిరీస్ ఆడాడు. అప్పటి నుంచి అతను టీమిండియాకు సెలక్ట్ కాలేదు. భారత్-బి టీమ్ లో కూడా ధావన్ కు చోటు దక్కలేదు. అయితే శిఖర్ ధావన్ కు అన్యాయం జరిగిందంటూ రవిశాస్త్రి టీమిండియాపై ఫైర్ అయ్యారు.

Dhawan : ధావన్‎కి అన్యాయం జరిగింది..టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్..!!
New Update

Ravi Shastri Fires On Team India: శిఖర్ ధావన్ 2015 ప్రపంచ కప్..2019 ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు విజయాల్లో ముఖ్యమైన పాత్ర పోషించాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ, టీమ్ ఇండియాను ఛాంపియన్‌గా నిలపడంలో ధావన్‌దే ప్రధాన పాత్ర. అయితే ఇప్పుడు ఈ ఆటగాడు టీమ్ ఇండియా ప్లాన్‌లో లేడు. ఆసియా కప్, ప్రపంచకప్‌లకు ముందు ఒక్క సిరీస్‌లో కూడా అతనికి అవకాశం రాకపోవడానికి ఇదే కారణం. ఆసియా కప్‌, ఐర్లాండ్ సిరీస్‌ల కోసం భారత్-బీ జట్టులో కూడా అతనికి చోటు లభించలేదు. ఈ డాషింగ్ ఓపెనర్‌కు సంబంధించి టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.

స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన రవిశాస్త్రి, టీమ్ ఇండియా వరల్డ్ కప్, ఆసియా కప్ ప్రణాళికపై చర్చించారు. అదే సమయంలో, అతను కేఎల్‌ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ గాయం తర్వాత తిరిగి రావడంతో పాటు అనేక అంశాలపై స్పందించాడు. తిలక్ వర్మ, ఇషాన్ కిషన్లను ప్రశంసించాడు. అటు శిఖర్ ధావన్‌పైనా మనసులో మాట బయటపెట్టాడు. శాస్త్రి చాలా కాలం పాటు టీమిండియాకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు..అదే సమయంలో శిఖర్ ధావన్ టీమ్ ఇండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత ఈ స్టార్ ఆటగాడి కెరీర్ ముగిసిపోయిందనే వార్తలు గుప్పుమన్నాయి.

ధావన్‌కు క్రెడిట్ దక్కలేదు:
రవిశాస్త్రి శిఖర్ ధావన్‌కు క్రెడిట్ దక్కలేదని స్పష్టంగా చెప్పాడు. అతనొక అద్భుతమైన ఆటగాడు. 2019లో ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌లో ఓడిపోయినప్పుడు, జట్టు ధావన్ ను చాలా మిస్ అయింది. ఆ ప్రపంచ కప్‌లో, ధావన్ గాయం కారణంగా తప్పుకోవల్సి వచ్చింది. టాప్ ఆర్డర్‌లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ టీమిండియా ఎంతో సహాయపడుతుందని రవిశాస్త్రి అన్నారు. బంతి స్వింగ్ అయినప్పుడు, అది కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌కి ఇబ్బంది కానీ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు కాదు అని, తద్వారా పరుగులు చేయడం సులభం అవుతుందన్నారు.

ప్రపంచకప్‌లో శిఖర్ ధావన్ అద్భుతమైన రికార్డు:
శిఖర్ ధావన్ రికార్డు గురించి మాట్లాడుతూ, అతను ప్రపంచ కప్‌లో గొప్ప రికార్డును కలిగి ఉన్నాడు. 2015, 2019 లో రెండు ప్రపంచ కప్‌లలో ఆడాడు. 10 మ్యాచ్‌లలో 10 ఇన్నింగ్స్‌లలో 537 పరుగులు చేశాడు. అత్యుత్తమ స్కోరు 137 పరుగులు. ఈ టోర్నీలో ధావన్ మొత్తం 3 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ సాధించాడు. ఈ టోర్నీలో, అతని స్ట్రైక్ రేట్ దాదాపు 94 ,సగటు 53.7. డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్ నుండి అతను టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. వన్డే క్రికెట్‌లో ధావన్ 17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. భారత్ తరఫున 167 వన్డేల్లో 164 ఇన్నింగ్స్‌ల్లో 6793 పరుగులు చేశాడు. అదే సమయంలో, ధావన్ 34 టెస్ట్ మ్యాచ్‌లలో 2315 పరుగులు, 68 T20 ఇంటర్నేషనల్స్‌లో 1759 పరుగులు చేశాడు.

Also Read: రిటైర్మెంట్‌ ప్రకటించిన రోజు జ్ఞాపకాలను పంచుకున్న ధోనీ

#ravi-shastri #indian-cricket-team #shikhar-dhawan #dhawan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe