Ration shop: రేషన్ కార్డు దారులకు మోదీ శుభవార్త.. అందుబాటులోకి మరిన్ని సరుకులు!

రేషన్‌ షాపులను జన్‌ పోషణ్‌ కేంద్రాలుగా మార్చబోతున్నట్లు మోదీ సర్కార్ ప్రకటించింది. పేదలకు పోషకాలు అందించడంతోపాటు రేషన్‌ డీలర్ల ఆదాయం పెంచేందుకు పైలట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించినట్లు మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. నిత్యవసర సరుకుతోపాటు పాల ఉత్పత్తులు విక్రయించనున్నారు.

Ration shop: రేషన్ కార్డు దారులకు మోదీ శుభవార్త.. అందుబాటులోకి మరిన్ని సరుకులు!
New Update

Jan Poshan: దేశంలోని పేదలకు మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. రేషన్‌ షాపులను (FPS) జన్‌ పోషణ్‌ కేంద్రాలుగా మార్చబోతున్నట్లు ప్రకటించింది. బియ్యం, ఉప్పు, పప్పులతో పాటు విభిన్న రకాల పోషక ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు లబ్ధిదారులకు పోషకాలు అందించడంతోపాటు రేషన్‌ షాప్‌ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పైలట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించినట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు.

60 రేషన్‌ షాపులను జన్‌ పోషణ్‌ కేంద్రాలుగా..

ఇందులో భాగంగానే మేరా రేషన్‌ యాప్‌ అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ను పరిచయం చేసిన జోషి.. తెలంగాణ, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ ప్రాంతాల్లోని 60 రేషన్‌ షాపులను జన్‌ ఫోషణ్‌ కేంద్రాలుగా మార్చనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఎఫ్‌పీఎస్‌లు 8- 9 రోజులు మాత్రమే తెరుస్తున్నారు. మరికొన్ని 3 నెలలకు ఒకసారి మాత్రమే పనిచేస్తాయి. మిగతా టైమ్ లో దుకాణాలు అందుబాటులో ఉండట్లేదు. దీంతో డీలర్లకు కమీషన్లు సరిపోవట్లేదు. దీనికి ప్రత్యామ్నాయం కోసం కొత్త విధానాలు ప్రవేశపెట్టాల్సి ఉందని జోషి అన్నారు.

ఇది కూడా చదవండి: Rape case: బాలికలు లైంగిక కోరికలు తగ్గించుకోవాలన్న హైకోర్టుకు సుప్రీంకోర్టు చురకలు!

ఈ దుకాణాల్లో రోజువారీ నిత్యవసర సరుకులైన చిరుధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి. అదే విధంగా డీలర్ల అదనపు ఆదాయాలకోసం ఎఫ్‌ఎమ్‌సీజీ విభాగంలో మొత్తం 3,500 ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికీ దేశంలో 5.38 లక్షల ఎఫ్‌పీఎస్‌లు వినియోగంలో ఉన్నాయి.

#modi-government #jan-poshan-centre #ration-shops
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe