రష్మిక డీప్‌ఫేక్‌ వీడియోపై స్పందించిన మాజీ ప్రియుడు.. ఎమన్నాడో తెలుసా?

రష్మిక మందన్నా డీప్‌ఫేక్‌ వీడియోపై ఆమె మాజీ ప్రియుడు, హీరో రక్షిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జీవితాన్ని గొప్పగా కలలు కంటున్న రష్మికకు ఇలా జరగడం బాదేసిందన్నారు. ఇలాంటి వాటిని ముందు అరికట్టాలి. ప్రతి సాఫ్ట్ వేర్ కు లైసెన్స్ ఖచ్చితం అనే రూల్ తీసుకురావాలని సూచించారు.

New Update
రష్మిక డీప్‌ఫేక్‌ వీడియోపై స్పందించిన మాజీ ప్రియుడు.. ఎమన్నాడో తెలుసా?

Rakshit Shetty: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) డీప్‌ఫేక్‌ వీడియో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా దీనిపై పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే యాక్షన్‌ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే రష్మికకు అండగా నిలిచారు. అయితే ఈ ఇష్యూపై తాజాగా రష్మిక మాజీ ప్రియుడు కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్య‌లు చేశారు.

Also read :డేవిడ్ బెక్‌హ‌మ్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చిన అంబానీ ఫ్యామిలీ.. పిక్స్ వైరల్

ఈ మేరకు రక్షిత్ శెట్టి న‌టించిన తాజా చిత్రం 'స‌ప్త సాగరాలు దాటి సైడ్-బీ' నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సందర్భంగా సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా హైద‌రాబాద్ వ‌చ్చిన రక్షిత్ పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే రష్మిక డీప్‌ ఫేక్ వీడియో (Deep fake Video) గురించి మాట్లాడుతూ.. డీప్‌ఫేక్‌ వీడియో వంటి ఘ‌ట‌న‌ల‌పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రతి సాఫ్ట్ వేర్ కి లైసెన్స్ ఖచ్చితం అనే రూల్ తీసుకురావాలి. ప్రస్తుతం ఇలాంటి సాఫ్ట్ వేర్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. వాటిని ముందు అరికట్టాలి. రష్మిక తన కెరీర్ కోసం ఎన్నో కలలుగంటోంది అవి నేర‌వేరాలంటూ ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. ప్రస్తుతం రక్షిత్ కామెంట్స్ వైరల్ అవుతుండగా ఇరువురి ఫ్యాన్స్ రక్షిత్ మంచి తనాన్ని పొగిడేస్తున్నారు. మరికొందరు మాత్రం బ్రేకప్ ఇష్యూను గుర్తు చేస్తూ సింపతి చూపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. 2017లో వీరిద్దరి కలయికలో వచ్చిన 'కిరిక్ పార్టీ' చిత్రంతో కన్నడలో బిగ్గెస్ట్ బ్ల‌క్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఇక ఈ మూవీ టైంలోనే రష్మిక మందన్నా, రక్షిత్ శెట్టి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కానీ కొన్నాళ్లకే తమ నిశ్చితార్థంను బ్రేక్ చేసుకున్నారు.
అప్పట్లో ఈ సమస్యతోనూ రష్మిక ఇబ్బందులు పడింది.

Also Read: రవితేజ ఫ్యాన్స్​కు సడెన్ సర్ ప్రైజ్.. ఓటీటీలో ‘టైగర్ నాగేశ్వరరావు’

Advertisment
Advertisment
తాజా కథనాలు