Vijay Devarakonda: విజయ్ పెళ్ళిలో రష్మిక డాన్స్.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..!

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. అయితే ఈ సినిమాలోని 'కళ్యాణీ వచ్చా వచ్చా' ఫుల్ సాంగ్ లో రష్మిక ఉండనున్నట్లు నెట్టింట్లో వార్తలు వైరలవుతున్నాయి. ఆ పాటలో రష్మిక స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

New Update
Vijay Devarakonda: విజయ్ పెళ్ళిలో రష్మిక డాన్స్.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..!

Vijay Devarakonda: పరుశురామ్ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఫ్యామిలీ స్టార్. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు- శిరీష్ నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ ఈ మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫ్యామిలీ స్టార్ టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘ఐరనే వంచాలా ఏంటి‘ అనే డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది.

Also Read: Kiran Abbavaram: తన మొదటి సినిమా హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం..!

'కళ్యాణి వచ్చా వచ్చా' సాంగ్

అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. 'కళ్యాణి వచ్చా వచ్చా' సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. పెళ్ళికి సంబంధించిన ఈ పాటలో మృణాల్, విజయ్ ట్రెడిషనల్ లుక్ లో కనిపించారు. సాంగ్ లోని విజువల్స్, కొరియోగ్రఫీ పాటకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఈ పాటకు గోపి సుందర్ సంగీతం అందించగా.. మంగ్లీ, కార్తిక్ ఆలపించారు. విడుదలైన క్షణాల్లోనే ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

publive-image

ఫ్యామిలీ స్టార్ పాటలో రష్మిక స్పెషల్ అపియరెన్స్ 

ఇది ఇలా ఉంటే 'కళ్యాణి వచ్చా వచ్చా' ఫుల్ సాంగ్ లో రష్మిక ఉండబోతున్నట్లు న్యూస్ వైరలవుతోంది. సినిమాలో విజయ్, మృణాల్ పెళ్ళికి సంబంధించిన ఈ పాటలో రష్మిక స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతున్నట్లు  తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Also Read: Operation Valentine: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆపరేషన్ వాలెంటైన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Advertisment
తాజా కథనాలు