Rashmika: శ్రీలీల స్థానంలో రష్మిక

వరుసపెట్టి సినిమాలు చేస్తున్న శ్రీలీల, చాలా ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది కానీ కాల్షీట్లు మాత్రం ఎడ్జెస్ట్ చేయలేకపోతోంది. ఎవరికైనా ఉన్నది 24 గంటల టైమ్ మాత్రమే. శ్రీలీల కూడా ఆ టైమ్ లోనే కాల్షీట్లు సర్దుబాటు చేయాలి. అలా ఈ బ్యూటీ రోజుకు 2 సినిమాలు, ఒక్కోసారి 3 సినిమాలు కూడా చేస్తోంది.

New Update
Rashmika: శ్రీలీల స్థానంలో రష్మిక

వరుసపెట్టి సినిమాలు చేస్తున్న శ్రీలీల, చాలా ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది కానీ కాల్షీట్లు మాత్రం ఎడ్జెస్ట్ చేయలేకపోతోంది. ఎవరికైనా ఉన్నది 24 గంటల టైమ్ మాత్రమే. శ్రీలీల కూడా ఆ టైమ్ లోనే కాల్షీట్లు సర్దుబాటు చేయాలి. అలా రోజుకు 2 సినిమాలు, ఒక్కోసారి 3 సినిమాలు కూడా చేస్తోంది ఈ బ్యూటీ. అయినప్పటికీ ఇంకొన్ని సినిమాలకు ఆమె సర్దుబాటు చేయలేకపోతోంది. ఫలితంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడుతోంది. తాజా సమాచారం ప్రకారం, విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ నుంచి శ్రీలీల తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆమె స్థానంలో రష్మిక మందన్నను తీసుకున్నారు.

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి (జెర్సీ దర్శకుడు) కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఓపెనింగ్ కు శ్రీలీల కూడా హాజరైంది. ఇప్పుడీ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకున్నట్టు తెలుస్తోంది. డేట్స్ క్లాష్ కారణంగా ఆమె ప్రాజెక్ట్ నుంచి సైడ్ అయిందని, ఆ వెంటనే మేకర్స్ రష్మికను ఎంపిక చేసినట్టు సమాచారం.

గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండల ప్రాజెక్ట్ ఇటీవల ప్రారంభించబడింది రౌడీ ఫ్యాన్స్ దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. గతంలో జెర్సీ, మళ్లీ రావా వంటి ఎమోషనల్ డ్రామాలకు దర్శకత్వం వహించిన గౌతమ్, విజయ్ దేవరకొండతో చాలా ప్రత్యేకమైన చిత్రాన్ని తీస్తున్నాడు. ఈ సినిమాలో అతడు గూఢచారిగా కనిపించబోతున్నాడు. లాంచ్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి.

ఈ సినిమాకు లాంగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసింది సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. పైగా విజయ్ దేవరకొండ నుంచి భారీగా కాల్షీట్లు అవసరం. అదే టైమ్ లో హీరోయిన్ కూడా ఎక్కువసార్లు అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి ప్రాజెక్టులో శ్రీలీల లాంటి బిజీ హీరోయిన్ సెట్ అవ్వదు. అందుకే ఆమె తప్పుకుంది.

Advertisment
తాజా కథనాలు