Movies:ది గర్ల్ ఫ్రెండ్ గా లేడీ ఓరియెంటెడ్ మూవీలో కనిపించబోతున్న నేషనల్ క్రష్

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకొని దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఈ అమ్మడు వరుస ప్రాజెక్ట్స్ తో ఇటు సౌత్ లో అటు నార్త్ లో తన బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటోంది.తాజాగా వుమెన్ ఓరియెంటెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందు రాబోతోందని తెలుస్తోంది. ద గర్ల్ ఫ్రెండ్ పేరుతో మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేసింది టీమ్.

New Update
Movies:ది గర్ల్ ఫ్రెండ్ గా లేడీ ఓరియెంటెడ్ మూవీలో కనిపించబోతున్న నేషనల్ క్రష్

ప్రస్తుతం పుష్ప-2 లో ,హిందీలో రణబీర్ కపూర్ కి జోడీగా యానిమల్ చిత్రంలో రష్మిక నటిస్తోంది. యానిమల్ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కాబోతోంది. తెలుగులో పుష్ప 2 మూవీ సెట్స్ పైన ఉంది. తెలుగు, తమిళ్ బైలింగ్వల్ గా రెయిన్ బో అనే మరో సినిమా కూడా చేస్తోంది. హిందీలో కూడా విక్కీ కౌశల్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇప్పుడు మరో ఫిమేల్ సెంట్రిక్ మూవీకి రష్మిక మందన్నా చేస్తోంది. అది కూడా గీతా ఆర్ట్స్ లాంటి ప్రస్టేజియస్ బ్యానర్ లో.

అందాల రాక్షసి సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ద గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాను చేస్తోంది రష్మిక. ముందు నుంచే ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ అని చెబుతున్నారు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ తరువాత చిలసౌ సినిమాతో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ చిత్రంలో సుశాంత్ హీరోగా నటించారు. మూవీ ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా ఓకే అనిపించుకున్నాడు. దాని తర్వాత నాగార్జునతో మన్మథుడు 2 మూవీ చేశాడు. ఇది మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ కి ఇది పెద్ద దెబ్బే వేసింది. దీంతో కొంత కాలం పాటూ దర్శకత్వానికి గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో మరో సారి తన అదఈష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు రాహుల్.

Also Read:తెలంగాణలో ఆ పార్టీదే గెలుపు.. మిషన్ చాణక్య సంచలన సర్వే.. వివరాలివే!

గీతా ఆర్ట్స్ రాహుల్ కు అవకాశం ఇచ్చింది. రష్మిక మందన్నాని లీడ్ రోల్ గా తీసుకొని ది గర్ల్ ఫ్రెండ్ టైటిల్ తో ఈ సినిమాని తాజాగా ఎనౌన్స్ చేశారు. చిన్న వీడియో గ్లింప్స్ తో రష్మిక తన ఇన్ స్టాగ్రామ్ లో మూవీ గురించి కన్ఫార్మ్ చేసింది. ఖుషి సినిమాకి సంగీతం అందించిన అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నారు. త్వరలో సినిమా సెట్స్ పైకి వెళ్తుందని వీడియోలో కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రంలో ఒక అబ్బాయిని గొప్పగా ప్రేమించే అమ్మాయి గురించి రాహుల్ రవీంద్రన్ చెప్పబోతున్నట్లు గ్లింప్స్ వాయిస్ ఓవర్ బట్టి అర్ధమవుతోంది.

Advertisment
తాజా కథనాలు