Rashmika : విజయ్ దేవరకొండ పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేసిన బ్యూటీ

విజు , నేను ఇద్దరం కలిసే ఈ స్థాయికి వచ్చాం. అందుకే ప్రస్తుతం నా జీవితంలో నేను ఏం చేసినా అందులో కచ్చితంగా అతని భాగస్వామ్యం ఉంటుంది. నేను చేసే ప్రతి చిన్న పనికీ అతని సలహా తీసుకుంటాను అంటూ టాలీవుడ్ ముద్దుగుమ్మ, నేషనల్‌ క్రష్‌ రష్మిక చెప్పుకొచ్చింది.

Rashmika : విజయ్ దేవరకొండ పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేసిన బ్యూటీ
New Update

Rashmika : టాలీవుడ్‌(Tollywood) ప్రేమ పక్షులుగా అందరు అనుకుంటున్న రష్మిక(Rashmika), విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) ల విషయంలో ఎప్పుడూ ఆసక్తే. తమ మధ్య ఏముందో ఎవరికీ... ఇప్పటి వరకూ చెప్పలేదు కానీ.. తరచూ తమ మాటల ద్వారా మాత్రం ఏదో సందర్భంలో వారు తమ ఇష్టాలను తెలియజేస్తూనే ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా మరోసారి రష్మిక మాటల ద్వారా విజయ్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్లు చేసింది. విజయ్‌ తనకు సపోర్ట్‌ ఇచ్చినట్లు ఎవరూ ఇవ్వలేదని.. తాను చేసే ప్రతి పనిలో కూడా విజయ్‌ భాగస్వామ్యం ఉంటుందని రష్మిక చెప్పుకొచ్చింది.

రష్మిక కొద్ది రోజుల క్రితం యానిమల్(Animal) చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ సక్సెస్‌ లో రష్మిక ఓ ఇంటర్వ్యూ(Interview) లో మాట్లాడింది. ఇందులో తన సహా నటులు అమితాబ్‌, సిద్దార్థ్‌ మల్హోత్రా, రణబీర్‌ కపూర్‌, అల్లు అర్జున్‌ ల గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె ప్రత్యేకంగా విజయ్‌ దేవరకొండ పై చేసిన కామెంట్స్‌ మాత్రం ప్రస్తుతం అందరిని ఆకర్షిస్తున్నాయి.

విజు, నేను ఇద్దరం కలిసే..

ఈ మాటలు వింటే ఎవరికైనా సరే వారిద్దరి మధ్య ఏదో ఉందన్నట్లుగా రష్మిక మాటలు ఉన్నాయి. '' విజు , నేను ఇద్దరం కలిసే ఈ స్థాయికి వచ్చాం. అందుకే ప్రస్తుతం నా జీవితంలో నేను ఏం చేసినా అందులో కచ్చితంగా అతని భాగస్వామ్యం ఉంటుంది. నేను చేసే ప్రతి చిన్న పనికీ అతని సలహా తీసుకుంటాను.

నా లైఫ్‌ లో విజయ్‌..

నాకు అతని అభిప్రాయం అవసరం. ప్రతి దానికీ ఎస్‌ అని చెప్పే వ్యక్తి కాదు విజయ్‌. కచ్చితంగా ఓ అభిప్రాయం ఉంటుంది. ఇది మంచిది.. ఇది కాదు.. నేను ఇలా అనుకుంటున్నాను.. నేను ఇది అనుకోవడం లేదు. నా లైఫ్‌ లో విజయ్‌ నాకు సపోర్ట్‌ చేసినట్లుగా ఎవరూ చేయలేదు. అందుకే అతన్ని నేను చాలా చాలా గౌరవిస్తాను'' అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.

ఈ మాటలు బట్టి చూస్తే రష్మిక తనకి, విజయ్‌ కి మధ్య ఉన్న రిలేషన్‌ గురించి కన్ఫామ్‌ చేసినట్లు అనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకోనున్నట్లు వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే వాటిని విజయ్‌ కొట్టి పడేశాడు. నేను ఫిబ్రవరిలో నిశ్చితార్థం కానీ, పెళ్లి కానీ చేసుకోవడం లేదని వివరించారు. మీడియా ప్రతి రెండేళ్లకు నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు అనిపిస్తోంది.

ప్రతి ఏడాది ఈ రుమార్స్‌ నాకు వినిపిస్తునే ఉన్నాయి. నన్ను పట్టుకొని పెళ్లి చేయాలని చూస్తున్నట్లుగా ఉంది.. అంటూ విజయ్‌ చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు రష్మిక అన్న మాటలు ఇలా ఉన్నాయి.

Also Read : హైదరాబాద్‌లో మరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు

#tollywood #vijay-devarakonda #rashmika-mandanna #crush
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe