Vijay Devarakonda - Rashmika: "అవును ఇష్టపడుతున్నాను.. ప్రేమిస్తున్నాను".. విజయ్ దేవరకొండతో రిలేషన్ షిప్ పై రష్మిక షాకింగ్ కామెంట్స్..! విజయ్ - రష్మిక రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రష్మిక వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం, ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విజయ్, తన ఆలోచనలు దాదాపు ఒకేలా ఉంటాయని. అలా ఉండడాన్ని తాను ఇష్టపడతానని చెప్పింది. By Archana 05 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Rashmika on Relationship With Vijay Devarakonda: నేషనల్ క్రష్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. పుష్పతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ రీసెంట్ గా యానిమల్ సక్సెస్ తో మరో భారీ విజయాన్ని అందుకుంది. అయితే గత కొంత కాలంగా రష్మిక - విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ కూడా వచ్చింది. కానీ వీటి పై రష్మిక, విజయ్ (Vijay Devarakonda) ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అంతే కాదు వీరిద్దరూ కలిసి వెకేషన్స్ కు వెళ్లినట్లు కూడా చాలా సార్లు బయటపడింది. సోషల్ మీడియాలో వీళ్ళు షేర్ చేసిన ఆధారంగా ఇద్దరు కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిసింది. Also Read: Raashii Khanna: హైదరాబాద్ లో రాశీ కన్నా కొత్త ఇంటి గృహప్రవేశం .. వైరలవుతున్న ఫొటోలు విజయ్ ని 'విజ్జు' అని పిలుస్తాను అయితే తాజాగా నేహా ధూపియా టాక్ షోలో పాల్గొన్న రష్మిక విజయ్ తో సినిమాలు, స్నేహం, ప్రేమ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విజయ్ దేవరకొండ, తన ఆలోచనలు దాదాపు ఒకేలా ఉంటాయని. ఇద్దరూ కలిసి ‘డియర్ కామ్రేడ్’, ‘గీతా గోవిందం’ సినిమాలు చేశామని. తమ ఆలోచనలు ఒకేలా ఉండడాన్ని తాను ఇష్టపడతానని, ప్రేమిస్తానని చెప్పుకొచ్చింది రష్మిక. అలాగే విజయ్ లో నచ్చని విషయమేంటో కూడా తెలిపింది. "విజయ్ ఎప్పుడు సీరియస్ గా ఉంటాడని..ఎల్లప్పుడూ వర్క్ గురించే ఆలోచిస్తాడని" వెల్లడించింది. అంతే కాదు విజయ్ ని తాను విజ్జు అని పిలుస్తానని. మిగతా ఫ్రెండ్ తో పోలిస్తే విజయ్ ఇచ్చే సలహాలు బెస్ట్ గా ఉంటాయని తనకు విజయ్ కు మధ్య ఉన్న బంధం గురించి చెప్పింది. View this post on Instagram A post shared by Neha Dhupia (@nehadhupia) Also Read: Anushka Malhotra: చిరంజీవి కూతురు ఎలా మారిపోయిందో చూడండి..! ఫొటోస్ వైరల్ #vijay-devarakonda #rashmika-mandanna #vijay-devarakonda-rashmika మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి