Ranbir, Bobby Deol: రాముడిగా రణ్ బీర్, కుంభకర్ణుడిగా బాబీ డియోల్.. మరో సారి కాంబో రిపీట్

నితిన్ తివారి దర్శకత్వంలో "రామాయణ్" వర్కింగ్ టైటిల్ తో సినిమా రాబోతున్నట్లు టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాముడిగా రణ్ బీర్ నటిస్తున్నారని టాక్ వినిపించింది. తాజాగా సినిమాలోని కుంభకర్ణుడి పాత్రలో బాబీ డియోల్ కనిపించనున్నారని మరో అప్డేట్ వైరలవుతుంది.

New Update
Ranbir, Bobby Deol: రాముడిగా రణ్ బీర్, కుంభకర్ణుడిగా బాబీ డియోల్.. మరో సారి కాంబో రిపీట్

Ranbir Kapoor, Bobby Deol in Ramayan: రీసెంట్ గా యానిమల్ సినిమాతో (Animal Movie) బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన బాబీ డియోల్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో అందరినీ మెప్పించారు. ఇక ఇప్పుడు వీళ్లిద్దరి మరో సారి స్క్రీన్ చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

"రామాయన్"

బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) రామాయణం కథ ఆధారంగా "రామాయణ్" (Ramayan) అనే వర్కింగ్ టైటిల్ తో మూడు భాగాలుగా ఓ సినిమాను తెరెకెక్కిస్తున్నారు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వీళ్లిద్దరు మరో సారి స్క్రీన్ షేర్ చేసుకోబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు డైరెక్టర్ నటీ నటుల ఎంపిక విషయంలో బిజీగా ఉన్నట్లు టాక్. ఇటీవలే రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor), సీత పాత్రలో టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi), రావణుడిగా కె. జీ. ఎఫ్ స్టార్ హీరో యష్, నటిస్తున్నట్లు టాక్ వినిపించింది.

publive-image

Also Read: Sreeleela Latest Photos: చీరకట్టులో శ్రీలీలాను ఇలా చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే!

కుంభకర్ణుడి పాత్రలో బాబీ డియోల్

ఇక తాజాగా మరో లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కుంభకర్ణుడి పాత్రలో బాబీ డియోల్, రామాయణ కథకు ముఖ్య కారణం కైకేయి పాత్రలో లారా దత్త కనిపించనున్నారని నెట్టింట్లో టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వార్తలు నిజమైతే యానిమల్ తర్వాత రణ్ బీర్, బాబీ డియోల్ మరో సారి కలిసి నటించే సినిమా ఇదే అవుతుంది.

Also Read: Pushpa 2: పుష్ఫ2 ఐటమ్ సాంగ్.. సమంతకు మించి ఊపేయనున్న బోల్డ్ బ్యూటీ

Advertisment
తాజా కథనాలు