Ramoji Rao: అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు..సీఎం రేవంత్ ఆదేశాలు

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు అంత్యక్రియలు అధికా లాంఛనాలతో జరిపించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా ఆదేశించారు.

Ramoji Rao: అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు..సీఎం రేవంత్ ఆదేశాలు
New Update

Last cermony Of Ramoji Rao: ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.తెలుగు పత్రిక, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఇక రామోజీరావు అంత్యక్రియలు అధికా లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అక్కడ నుండే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియ ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు సీఎస్ ద్వారా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Also Read:Ramoji Rao: రామోజీ మృతికి రేవంత్, చంద్రబాబు, జూ.ఎన్టీఆర్ తో పాటు ప్రముఖుల సంతాపం!

#telangana #cm-revanth-reddy #funeral #ramoji-rao
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe