Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. క్లారిటీ ఇచ్చిన సీఎం సిద్దరామయ్య కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం మధ్యాహ్నం రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరగడం కలకలం రేపుతోంది. అయితే ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ కేఫ్‌లో బ్యాగ్ పెట్టాడని.. అందులో ఉన్న ఐఈడీ వల్లే పేలుడు సంభవించినట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటన చేశారు. By B Aravind 01 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Rameshwaram Cafe Blast: కర్ణాటకలోని బెంగళూరులో ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగిన విషయం తెలిసిందే. గ్యాస్ సిలిండర్ పేలిందేమోనని అందరు అనుకున్నారు. కానీ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ కేఫ్‌లో బ్యాగ్ పెట్టాడని.. అందులో నుంచే పేలుడు సంభవించినట్లు కర్ణాటక సర్కార్ నిర్ధారించింది. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Karnataka CM Siddaramaiah) తెలిపారు. ఓ వ్యక్తి కేఫ్‌లో బ్యాగు పెట్టి వెళ్లిపోవడం.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు పేర్కొన్నారు. ఆ బ్యాగులో ఐఈడీ (IED) ఉండటం వల్లే పేలుళ్లు జరిగినట్లు చెప్పారు. Also Read: హైదరాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు 9 మందికి తీవ్ర గాయాలు అయితే ఈ పేలుడు ప్రభావానికి 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. పేలుడు జరిగిన వెంటనే భయంతో.. హోటల్ సిబ్బంది, కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. అక్కడికి చేరుకున్న బాంబు స్క్వాడ్, క్లూస్ టీం అధికారులు ఆ పేలుడుకు సంబంధించి ఆధారాలను సేకరించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. Another cctv video of the #RameshwaramCafeBlast from police sources 👇 Kar CM Siddharamaiah says complete probe on this issue will be conducted. It is confirmed it's IED blast. Accused seen near the cash counter and then left a bag which led to the blast.#RameshwaramCafe pic.twitter.com/5RZqRBWpkl — Induja Ragunathan (@R_Induja) March 1, 2024 ఘటనపై వివరాలివ్వాలి ఇదిలాఉండగా.. కేఫ్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ యాదవ్.. రామేశ్వరం కేఫ్ ఫౌండర్ అయిన నాగరాజుకు ఫోన్ చేశారు. తమ కేఫ్‌లో గ్యాస్ సిలిండర్ పేలలేదని.. ఓ కస్టమర్ వదిలిపెట్టిన బ్యాగులో నుంచి పేలుడు సంభవించినట్లు నాగరాజు వివరించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా వివరాలు ఇవ్వాలని ఎంపీ తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. Also Read: ఇంటర్ పరీక్ష పేపర్ లీక్.. ఎక్కడంటే #telugu-news #national-news #karnataka-cm-siddaramaiah #rameshwaram-blast #cafe-blast మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి