Khammam : నేడు రఘురామిరెడ్డి నామినేషన్.. భట్టి, తుమ్మల దూరం ! ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డిని ప్రకటించడంతో.. ఆయన ఈరోజు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి, ఎంపీ రేణుక చౌదరి రానుండగా.. మంత్రులు భట్టి, తుమ్మల దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 25 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Khammam : ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి(Raghu Rami Reddy) ని అధిష్ఠానం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఈరోజు నామినేషన్ వేయనున్నారు. భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఇందుకోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy), ఎంపీ రేణుకా చౌదరి హాజరుకానున్నారు. Also Read: భర్తకు గుడి కట్టించిన భార్య.. ఎక్కడంటే ఈ కార్యక్రమానికి మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు(Thummala Nageswara Rao) కూడా హాజరవుతారని.. పొంగులేటి క్యాంపు కార్యాలయం ప్రకటించింది. కానీ భట్టి, తుమ్మల పర్యటనపై ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు. దీంతో వీళ్లు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు పొంగులేటి, రేణుకా ఒక్కటయ్యారంటూ కాంగ్రెస్(Congress) లో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఖమ్మం లోక్‌సభ ఇంఛార్జిగా పొంగులేటి ఆచితూచి పావులు కదుపుతున్నారు. అంతేకాదు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు చేసేందుకు ఆయన యాక్షన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. Also Read: ఇంటర్ ఫలితాలు.. ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య #telangana-news #congress #lok-sabha-elections-2024 #minister-ponguleti-srinivas-reddy #raghu-rami-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి