Ram Mandir Inauguration: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి తేదీ ఖరారు.. ప్రధాని మోదీకీ ఆహ్వానం.. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి తేది ఖరారైంది. దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి వచ్చే ఏడాది జనవరి 22న రామమందిరాన్ని ప్రారంభించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆహ్వానం పలికారు. వారి ఆహ్వానాన్ని స్వీకరించిన ప్రధాని.. నా జీవితకాలంలో ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూడటం నా అదృష్టమని ఎక్స్‌లో పేర్కొన్నారు. By B Aravind 25 Oct 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా రామ మందిరాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసింది. శరవేగంగా జరుగుతున్న ఆలయ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రామమందిరానికి సంబంధించి ఓ కీలక ప్రకటన వెల్లడైంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆలయ ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు తేదీ ఖరారైపోయింది. దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి వచ్చే వచ్చే ఏడాది జనవరి 22న రామమందిరాన్ని ప్రారంభించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సందర్భంగా ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఢిల్లీలో ప్రధానిని కలిశారు. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. ట్రస్ట్ సభ్యుల ఆహ్వానాన్ని ప్రధాని మోదీ స్వయంగా అంగీకరించారు. Also Read: వైద్యుల నిర్లక్ష్యం.. 14 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ, హెపటైటీస్ వ్యాధులు.. ఇదిలా ఉండగా.. అయోధ్యలో నిర్మిస్తున్న ఈ రామమందిరాన్ని మూడంతుస్తుల్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆలయం భవనం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని ఇప్పటికే ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా ఇటీవలే చెప్పారు.2020 ఆగస్టు 5న ప్రధాని మోదీ.. రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ ఆలయానికి ప్రారంభోత్సవ తేదీ ఖరారైన నేపథ్యంలో ప్రధాని మోదీ ఎక్స్‌లో స్పందించారు. ‘‘ఈ రోజు భావోద్వేగాలతో నిండిన రోజని ఇటీవల శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు నన్ను కలవడానికి నా నివాసానికి వచ్చారని తెలిపారు. శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అయోధ్యకు రావాల్సిందిగా ఆయన నన్ను ఆహ్వానించారని.. దీన్ని నేను గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నానని అన్నారు. నా జీవితకాలంలో ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూడటం నా అదృష్టమని పేర్కొన్నారు. जय सियाराम! आज का दिन बहुत भावनाओं से भरा हुआ है। अभी श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के पदाधिकारी मुझसे मेरे निवास स्थान पर मिलने आए थे। उन्होंने मुझे श्रीराम मंदिर में प्राण-प्रतिष्ठा के अवसर पर अयोध्या आने के लिए निमंत्रित किया है। मैं खुद को बहुत धन्य महसूस कर रहा… pic.twitter.com/rc801AraIn — Narendra Modi (@narendramodi) October 25, 2023 #pm-modi #national-news #ram-mandir-news #ayodhyas-ram-mandir మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి