Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఈ నెల 22న రామాలయ ప్రారంభోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకను తిలకించేందుకు దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ముఖ్యమైన కార్యక్రమం జరగనున్న వేళ.. దేశవ్యాప్తంగా ఎంతోమంది వ్యాపాకులు, చిరువ్యాపారలకు లాభం చేకూరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో భారతదేశం అంతంటా రూ.50 వేల కోట్ల వ్యాపారం జరిగి దేశానికి సహాయపడే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేస్తోంది.
Also Read: రామలయ ప్రాణప్రతిష్టకు ప్రముఖులకు ఆహ్వానం
రాముడు, రామాలయ ఉత్పత్తులకు డిమాండ్
జనవరి 22న రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న వేళ.. రాముడు, రామాలయానికి సంబంధించిన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ప్రజలు కొనుగోలు చేసేలా దోహదపడుతుందని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. ఇప్పటికే ఈ ఉత్పత్తుల డిమాండ్‌కు అనుగూణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా వ్యాపారులు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
అయితే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రకారం చూసుకుంటే.. కండువాలు, కీ చైన్లు, రామాలయం నమునాలు, రామ్ దర్బార్, రామధ్వజ చిత్రాలు ఇలా ఇతర వస్తువులన్నింటికీ దేశవ్యాప్తంగా ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని సీఏఐటీ చెబుతోంది. అంతేకాదు అటు కస్టమర్ల డిమాండ్‌కు తగ్గట్లుగా కూడా మార్కెట్లో గాజులు, పెండెంట్‌లు వంటి వివిధ రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అలాగే రామమందిర చిత్రం ఉన్నటువంటి టీ షర్టులు, కుర్తాలు, ఇతర దూస్తులకు కూడా గణనీయంగా డిమాండ్ ఉన్నట్లు సీఏఐటి పేర్కొంది.