Double Ismart OTT : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'డబుల్ ఇస్మార్ట్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కిన 'డబుల్ ఇస్మార్ట్' మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో రిలీజైన 20 రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రావడం గమనార్హం.

Double Ismart OTT : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'డబుల్ ఇస్మార్ట్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
New Update

Double ISmart Movie OTT : డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) - ఉస్తాద్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) కాంబోలో తెరకెక్కిన 'డబుల్ ఇస్మార్ట్' (Double ISmart) మూవీ రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజైన సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఆగస్టు 15 న విడుదలై ఆడియన్స్ నుండి ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రిలీజ్ చేసినా.. సినిమా జనాలను మెప్పించలేకపోయింది. దీంతో ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి హడావిడి లేకుండా అర్ధరాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్‌ (Amazon Prime) లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో రిలీజైన 20 రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రావడం గమనార్హం.

Also Read : ట్యాక్స్ పేమెంట్ లో కోహ్లీని క్రాస్ చేసిన షారుఖ్.. ఏడాదికి అన్ని కోట్లు పన్ను కడుతున్నాడా?

మరి 'డబుల్ ఇస్మార్ట్' ను ఎవరైనా థియేటర్స్ లో మిస్ అయి ఉంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో రామ్ సరసన కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ సీనియర్‌ నటుడు సంజయ్‌దత్‌ కీలకపాత్ర పోషించారు.

#ram-pothineni #puri-jagannath #double-ismart-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe