Ayodhya : అయోధ్య రామునికి ఏడువారాల నగలు.. వాటి విలువ ఎంతో తెలుసా.. దేవుళ్ళు నగలు వేసుకుంటారని ఎవరు చెప్పారు...అసలు వాళ్ళని ఎవరు చూశారు. కానీ మనం సృష్టించకున్న దేవుళ్ళందరిలో ఒక్క శివుడు తప్ప అందరూ అలంకార ప్రియులే. అందరూ నగలు వేసుకునేవారే. అది కూడా మామూలుగా కాదు ఏడువారాల నగలు ధరిస్తారు. ఇందుకు అయోధ్య బాలరాముడు కూడా అతీతం కాదు. By Manogna alamuru 23 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Ram Lalla : అయోధ్య(Ayodhya) లో శ్రీరాముని స్థాపన కొన్నేళ్ళ కల. హిందువులు(Hindu) ఈ విశేషం కోసం చాలా రోజులు ఎదురు చూసారు. మొత్తానికి నిన్నటితో భారతీయ హిందువుల అందరూ తృప్తి చెందారు. కన్నులారా బాలరాముడిని చూసి తరించారు. బాలరాముని సుందర దివ్యమూర్తి అందరినీ విశేషంగా ఆకటర్టుకుంది. దాంతో పాటూ ఆయన వేసుకున్న నగల గురించి కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. రామ్ లల్లా(Ram Lalla) కు ఏమేమి నగలు వేశారు అని చర్చించుకుంటున్నారు. నిన్న అయోధ్యలో కొలువైన బాలరాముడి విగ్రహానికి ఏడు వారాల నగలు ధరింపజేశారు. వీటిని భక్తులే సమర్పించారు. ఈ నగల విలు అక్షరాలా 428 కోట్లు. వజ్రవైఢూర్యాలతో అలరారుతున్న బాలరాముని నగలకు చాలానే విశిష్టత ఉంది. Also Read:చైనాను కుదిపేసింది.. ఢిల్లీని వణికించింది ఏడు వారాలకు ఏడు రకాల నగలు... బాల రామునికి భక్తులే నగలు కానుకగా ఇచ్చారు. సుందరాకారుడు అయిన బాలరాముడు రోజూ ఒకేలా కనిపించకూడదని ఏడు వారాలకు తగ్గట్టుగా ఏడు రకాల నగలను సమర్పించుకున్నారు. మన పూర్వీకులు ఏడు వారాలకు ఏడు గ్రమాలను అధిపతులుగా నిర్ణయించారు. ఈ అధిపతులకు ఇష్టమైన రత్నాలను కూడా నిర్ణయించారు. నవగ్రహాల అనుగ్రహం కావాలంటే వారికి ఇష్టమైన రత్నాలను ధరించాలని చెబుతారు. పూర్తిగా ఆడవారు ఇలానే నగలను ధరించేవారు కూడా. ఇప్పుడు బాలరామునికి ఆ ప్రకారమే నగలను చేయించారు. ఆదివారం: సూర్యని దినానికి గుర్తు అయిన ఈరోజున స్వామివారికి కెంపులతో కూడిన నగలను వేస్తారు. తల నుంచి కాళ్ళ వరకు మొత్తం కెంపులతో చేసిన హారాలే ఉంటాయి. సోమవారం:ఇది చంద్ర దినం. చంద్రునికి ముత్యాలంటే ఇష్టమని చెబుతారు. అందుకే ఈరోజున బాలరామునికి ముత్యాల హారాలు ధరింపజేస్తారు. మంగళవారం:కుజుడు ఈరోజుకు అధిపతి. ఈయన అనుగ్రహం కోసం పగడాల గొలుసులు, ఉంగరాలు ఉంటాయి. బుధవారం:బుధుడు అధిపతి అయిన ఈరోజు పచ్చల పతకం, జచ్చలు అమర్చిన గాజులు వేస్తారు గరువారం:దేవగురువు బృహస్పతి అధిపతి అయిన ఈరోజున పుష్యరాగము ఉన్న కమ్మలు, ఉంగరాలు బాలరాముడు ధరిస్తాడు. శుక్రవారము:శుక్రుని వారమైన ఈరోజు రామ్‌లల్లా వజ్రాల హారాలు, వజ్రపు ముక్క పుడక, వజ్రాల కమ్మలు వేసుకుంటారు. శనివారము:ఈరోజు శని అధిపతి. ఈయన అనుగ్రమం కోసం నీలమని హారాలు బాలరామునికి వేస్తారు. లక్నో నుంచి వచ్చిన నగలు... మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన బాలరాముని విగ్రహానికి ఆభరణాలను లక్నో(Lucknow) లోని ‘శ్రీ అంకుర్ ఆనంద్ సంస్థ’కు చెందిన ‘హర్షహైమల్ శ్యామ్‌లాల్ జ్యువెలర్స్’ తయారు చేసిందని శ్రీ రామ జన్మభూమి(Sri Rama Janmabhoomi) తీర్థ ట్రస్ట్ తెలిపింది. ఆధ్యాత్మ రామాయణం, వాల్మీకి రామాయణం, రామచరిత్‌మానస్, అలవందర్ స్తోత్రం వంటి గ్రంథాలలో శ్రీరాముడి వైభవం, ధరించిన దివ్య ఆభరణాల గురించి విస్తృతమైన అధ్యయనం చేసిన తర్వాత వీటిని తయారు చేయించామని చెబుతున్నారు ట్రస్ట్ సభ్యులు. బాలరాముని ఆభరాణాలు ఇవే... విజయమాల బంగారంతో తయారు చేసిన విజయమాల బాలరాముని మెడలో ఉంటుంది. కెంపులతో పొదిగిన దీనిని విజయానికి చిహ్నంగా భావిస్తారు. దీని మీద వైష్ణవ సంప్రదాయ చిహ్నాలైన సుదర్శన చక్రం, కమలం, శంఖం, మంగళ కలశం ముద్రించి ఉన్నాయి. భూబంధ్ బాల రాముడు రెండు చేతులతో పట్టుకున్న ఆయుధాలను భూబంధ్ అంటారు. బంగారం, విలువైన రాళ్లతో ఈ ఆయుధాలను తయారు చేశారు. కంచి/కర్ధాని బాలరాముడి నడుము చుట్టూ రత్నాలు పొదిగి ఉన్న నగను కంచి అంటారు. దీన్ని పూర్తిగా బంగారంతోనే తయారు చేశారు. వజ్రాలు, కెంపులు, ముత్యాలు, పచ్చలతో దీనిని అలంకరించారు. స్వచ్ఛతకు ప్రతీకగా చిన్న గంటలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు దీనికి వేలాడుతూ ఉంటాయి. కంగన్ అందమైన రత్నాలు పొదిగిన గాజులు. వీటిని రామ్ లల్లా రెండు చేతులకు తొడిగారు. ముద్రిక రత్నాలతో అలంకరించిన ఉంగరాలు. రెండు చేతులకు వేలాడుతున్న ముత్యాలు. ఛడ లేదా పైంజనియా బాల రాముడి పాదాలు, బొటనవేళ్లను అలకరించిన ఆభరణాలు. వీటిని బంగారం, వజ్రాలు, కెంపులతో రూపొందించారు. మరిన్ని... పైవి కాక బాలరాముడు చుట్టూ కూడా ఇంకా చాలా ఉన్నాయి. రాముని చేతిలో బంగారు ధనస్సు ఉంటుంది. కుడి చేతిలో అదే బంగారంతో తయారు చేసిన బాణం కూడా ఉంది. అలాగే రాముని నుదుటి మీద వజ్రాలు, కెంపులతో తయారు చేసిన తిలకాన్ని అద్దారు. ఇక ఆయన పాదాల కింద బంగారు కమలం, దండ అమర్చి ఉన్నాయి. అయోధ్య రాముడు ఐదేళ్ళ పిల్లాడు కాబట్టి ఆయన విగ్రహం చుట్టూ కొన్ని బొమ్మలను కూడా అమర్చారు. ఇందులో వెండితో తయారు చేసిన గిలక్కాయ, ఏనుగు, గుర్రం, ఒంటె, బొంగరం వంటివి ఉన్నాయి. చివరగా బాల రాముడికి ఒక బంగారు గొడుగును కూడా తల మీదన అమర్చారు. Also Read : Jagan Vs Sharmila: గజదొంగల ముఠా.. చెల్లెలు షర్మిల టార్గెట్ జగన్ విమర్శల బాణాలు! #gold #jewellery #ayodhya #ram-lalla మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి