/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/power-star.jpg)
ఏపీలో ఎన్నికలకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎన్నికల ప్రచారానికి కూడా శనివారమే చివరి రోజు. ఇప్పుడు ఏపీ మొత్తం చూపు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం మీదనే ఉంది. ఎందుకంటే...అక్కడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలోకి దిగడమే. దీంతో ఇప్పటికే పవన్ తరుఫున ప్రచారం చేసేందుకు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి వీడియో ద్వారా అభిమానులకు, నియోజకవర్గ ప్రజలకు ఓటు వేయాలని విజ్ఙప్తి చేశారు.
ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారం చివరి రోజు మరింత హిట్ పెరగనుంది. ఏపీ సీఎం జగన్ ఓ పక్క, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పర్యటన మరొపక్క ప్రచారాలు చివరి రోజు ముగింపు కార్యక్రమాలు కావడంతో పిఠాపురం ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఏపీగా నిలిచింది. చివరి రోజు కావడంతో పవన్ కళ్యాణ్ తరుఫున ఎన్నికల ప్రచారంలో రామ్ చరణ్ పాల్గొననున్నారు.
ఇప్పటికే చిరంజీవి, అల్లు అర్జున్ సైతం పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించారు. రేపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్యటనకు సంబంధించిఅన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్న జనసేన, టీడీపీ కార్యకర్తలు నేతలు.
Also read: ఏపీలో పోలింగ్ ఏజెంట్ల నియామకాలపై ఈసీ కీలక ఆదేశాలు