Charan: మా కుటుంబానికి ఇది గర్వించదగ్గ రోజు ఇది..!

పవన్ కు మెగా కుటుంబ సభ్యుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా పవన్ విజయం గురించి స్పందించారు. "మా కుటుంబానికి ఇది గర్వించదగిన రోజు.

New Update
Charan: మా కుటుంబానికి ఇది గర్వించదగ్గ రోజు ఇది..!

Charan: 2019 ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మెగా ఫ్యామిలీ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ తన సమీప వైసీపీ ప్రత్యర్థి వంగా గీతపై 70,279 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

ఈ నేపథ్యంలో, పవన్ కు మెగా కుటుంబ సభ్యుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా పవన్ విజయం గురించి స్పందించారు. "మా కుటుంబానికి ఇది గర్వించదగిన రోజు. మా పవన్ కల్యాణ్ గారికి శుభాభినందనలు. ఆయన విజయం తిరుగులేనిది" అంటూ రామ్ చరణ్ కొనియాడారు.

Also read: ప్రతి ఒక్కరు పవన్‌ ని కుటుంబ సభ్యుడనుకోవాలి!

Advertisment
తాజా కథనాలు