/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-77.jpg)
Ram Charan Says Good Bye To Game Changer Shooting : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ చేంజర్' (Game Changer). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలు సార్లు బ్రేకులు పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ విషయంలో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు చిత్ర యూనిట్. సుమారు రెండేళ్లుగా ఈ సినిమా షూటింగ్ సాగుతూ వస్తోంది.
కమల్ హాసన్ ఇండియన్ 2 (Indian 2) మధ్యలో రావడంతో డైరెక్టర్ శంకర్ కి రెండు సినిమాలను ఒకేసారి కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే గేమ్ ఛేంజర్ విడుదల ఆలస్యమయ్యింది. ఇదిలా ఉంటే ఇన్ని రోజులు ఈ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న రామ్ చరణ్ త్వరలోనే గుడ్ బై చెప్పనున్నాడట. మరో పదిరోజుల్లో గేమ్ ఛేంజర్ షూటింగ్ కంప్లీట్ కానుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ లో ఉంది.
Also Read : ‘OG’ బ్లాస్ట్ ఆన్ ది వే.. స్పీకర్లు బద్దలవుతాయి – అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన థమన్!
మరో పదిరోజుల్లో ఇది కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టనున్నారట. అనంతరం మిగతా కార్యక్రామాలు కంప్లీట్ చేసి డిసెంబర్ కల్లా సినిమా విడుదల చేయనున్నారని సమాచారం. మరోవైపు చరణ్ తన నెక్స్ట్ మూవీ RC 16 ని పట్టాలెక్కించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుంచే 'RC 16' రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.