Ram Charan : చరణ్‌ ని అవమానించిన షారూక్.. మేకప్‌ ఆర్టిస్ట్‌ బయటపెట్టిన అసలు విషయం!

ముఖేష్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ ల ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమంలో బాలీవుడ్‌ నటుడు షారూక్‌ ఖాన్ స్టార్‌ రామ్‌ చరణ్‌ ని ఇడ్లీ, వడ అని సంబోధంచడం పై చరణ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ జెబా హాసన్‌ దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

New Update
Ram Charan : చరణ్‌ ని అవమానించిన షారూక్.. మేకప్‌ ఆర్టిస్ట్‌ బయటపెట్టిన అసలు విషయం!

Ram Charan : భారత కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ(Mukesh Ambani)  చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ(Anant Ambani) , రాధిక మర్చంట్(Radhika Merchant) ల 3 రోజుల ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు దేశంలోని ప్రముఖులే కాకుండా విదేశాల నుంచి కూడా చాలా మంది హాజరయ్యారు. ఎంతో ఘనంగా జరిగిన వేడుకల్లో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌(Ram Charan)  కు అవమానం జరిగిందని ఆయన మేకప్‌ ఆర్టిస్ట్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

దీంతో రామ్ చరణ్ అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. అసలేం జరిగిందంటే... రామ్‌ చరణ్‌ మేకప్‌ ఆర్టిస్ట్ జెబా హాసన్‌(Zeba Hassan) బాలీవుడ్‌ స్టార్‌ నటుడు షారూక్‌ ఖాన్ పై కోపాన్ని వ్యక్తం చేశాడు. అనంత్‌, రాధికా ప్రీ వెడ్డింగ్‌ బాష్‌(Anant-Radhika Pre-Wedding Bash) కు బాలీవుడ్ , సౌత్‌ సినిమా స్టార్స్ కూడా హాజరయ్యారు. ఈ వేడుకలో బాలీవుడ్‌ నుంచి సల్మాన్ ఖాన్, షారూక్‌ ఖాన్‌(Sharukh Khan) , అమీర్‌ ఖాన్‌, కలిసి స్టేజీ మీద అస్కార్‌ అవార్డు పాట నాటు నాటుకి స్టెప్పులు వేసేందుకు సిద్దం అయ్యారు.

ఈ క్రమంలోనే షారూక్‌ చరణ్‌ ని స్టేజీ మీదకి పిలిచే సందర్భంలో ఇడ్లీ, వడ చరణ్‌ స్టేజీ మీదకు రావాలని అన్నాడు. దీంతో చరణ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ జెబా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ జరిగిన విషయాన్ని రాసుకోచ్చారు.

ఈ విషయం గురించి తెలుసుకున్న చరన్‌ అభిమానులతో పాటు , తెలుగు సినీ అభిమానులు కూడా షారూక్‌ పై విమర్శలు చేస్తున్నారు.
ఒక అభిమాని ఇలా రాశాడు, "షారుక్ ఖాన్ దక్షిణ భారత రామ్ చరణ్‌ను ఇడ్లీ అని పిలుస్తూ సౌత్‌ హీరోలను అవమానించడం జరిగింది. ఇది వారి అహంకారానికి నిదర్శనం.'' అంటూ రాసుకొచ్చాడు.

మరికొందరు బాలీవుడ్‌ వారికి సౌత్‌ హీరోలంటే ఎప్పుడే చిన్న చూపే అంటూ రాసుకొచ్చారు. షారూక్‌ కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నారంటూ చాలా మంది అభిమానులు రాసుకొచ్చారు. దీనికి వారు తగిన సమాధానం చెప్పాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.

Also Read : సామాన్యుడికి బస్టాప్ ఉండదు.. కానీ, అంబానీ కోసం.. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్..

View this post on Instagram

A post shared by DNA India (@dna_india)

Advertisment
తాజా కథనాలు