RC16 Movie : మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ .. 'పెద్ది ' టైటిల్ లో రామ్ చరణ్

రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో RC16 అనే వర్కింగ్ టైటిల్ ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు 'పెద్ది' టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 20న పూజ కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించనున్నట్లు సమాచారం.

RC16 Movie : మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ .. 'పెద్ది ' టైటిల్ లో రామ్ చరణ్
New Update

Ram Charan : రామ్ చరణ్(Ram Charan) - ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) కాంబోలో తెరెకెక్కబోతున్న చిత్రం RC 16. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీ  పై  ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే  సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు మెగా ఫ్యాన్స్. ఇక సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో 'RC 16'  సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.  ఈ సినిమా అఫీషియల్ టైటిల్, ముహూర్తం డేట్  ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Also Read : Mamitha Baiju: నయా క్రష్‌.. రాజమౌళినే పడేసిందిగా.. ఎవరీ మమిత బైజూ?

'పెద్ది ' టైటిల్ లో రామ్ చరణ్

RC 16 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేసిన ఈ సినిమాను ఈ నెల 20న పూజ కార్యకమాలతో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారట. రామ్ చరణ్- బుచ్చి బాబు కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు 'పెద్ది'(Peddi) అనే టైటిల్ ను కూడా ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా(Social Media) లో తెగ వైరలవుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Ram Charan - Peddi

మైత్రీ మూవీస్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా .. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చరణ్ 'గేమ్ చేంజర్' మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తవగానే RC16 షూట్ లో పాల్గొంటారని సమాచారం.

Also Read : Surekha Vani : ఆయనను మళ్ళీ చూడాలి.. భర్తను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన సురేఖ వాణి

#peddi #rc16-movie-title #ram-charan-rc16 #buchi-babu-sana
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe