Railway Budget: బడ్జెట్ 2024లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైల్వేలకు స్థూల బడ్జెట్ మద్దతుగా రూ. 2,52,200 కోట్లు కేటాయించారు. దానితో పాటు అదనపు బడ్జెట్ వనరుల నుండి అదనంగా రూ. 10,000 కోట్లు కేటాయించారు. దీంతో పాటూ ఎనర్జీ, మినరల్, సిమెంట్ కారిడార్, పోర్ట్ కనెక్టివిటీ కారిడార్ ఇంకా హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్‌తో సహా మూడు ప్రధాన రైల్వే ఎకనామిక్ కారిడార్‌లు భారతదేశంలో వస్తాయని ఆమె ప్రకటించారు. ఇక వందే భారత్ , వందే మెట్రో లాంటి కొత్త ట్రైన్స్, ముంబయ్-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు, నమో భారత్ కార్యక్రమాలను అభివృద్ధి చేస్తామని నిర్మలమ్మ ప్రకటించారు.
అయితే ఈ రైల్వే బడ్జెట్ అందరినీ తీవ్రంగా నిరాశపరించింది. అనుకున్నట్టుగా ఎటువంటి రాయితీలు లభించలేదు. కొత్త ట్రైన్స్ రాలేదు. దీని కారణంగానే రైల్వే స్టాక్స్ కూడా భారీగా పడిపోయాయి.
రైల్ వికాస్ నిగమ్ (RVNL), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC), ఇర్కాన్ ఇంటర్నేషనల్, RailTel కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, Texmaco రైల్ & ఇంజనీరింగ్ వంటి రైల్వే స్టాక్‌లు కేంద్ర బడ్జెట్‌కు ముందు దృష్టి సారించాయి. నిన్న స్టాక్ మార్కెట్ మొదలైనప్పుడు బాగానే ఉన్న ఈ స్టాక్స్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత ఒక్కసారిగా పడిపోయాయి. ఈ స్టాక్‌లు దాదాపు 1-5 శాతం పడిపోయాయి.
రైల్ వికాస్ నిగమ్ (ఆర్‌విఎన్‌ఎల్) 6 శాతం, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సి) 5.6 శాతం, ఇర్కాన్ ఇంటర్నేషనల్ 9 శాతం, ఎన్‌బిసిసి (ఇండియా) 7 శాతం, రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 6.6 శాతం, టెక్స్‌మాకో ఇన్‌ఫ్రా ఫ్లాట్‌గా ట్రేడయ్యాయి. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ తర్వాత, ఈ స్టాక్స్ 11-112 శాతం మధ్య లాభపడ్డాయి.రైల్ వికాస్ నిగమ్ 112 శాతం పెరుగుదలతో టాప్ గెయినర్‌గా ఉంది, IRCON 44 శాతం మరియు రైల్‌టెల్ 37 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టెక్స్‌మాకో రైల్ 31 శాతం జంప్ చేయగా, ఐఆర్‌ఎఫ్‌సి 28 శాతం, ఎన్‌బిసిసి 12 శాతం పెరిగింది.