Rakul Preeth: పెళ్ళికి ముందు భర్తతో.. రకుల్ ప్రీత్ ప్రత్యేక పూజలు.. వైరలవుతున్న వీడియో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. పెళ్ళికి ముందు సాంప్రదాయాల్లో భాగంగా.. తాజాగాఆమె భర్త జాకీ భగ్నాతో కలిసి ముంబయిలోని వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతుంది. By Archana 18 Feb 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Rakul Preeth Singh : స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నటుడు జాకీ భగ్నా(Jackky Bhagnani) తో కొంత కాలంగా ప్రేమలో ఉన్న రకుల్.. ఫిబ్రవరి 21న వివాహం చేసుకోబోతున్నారు. గోవా(Goa) లోని ఒక రిసార్ట్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం(Marriage) జరగనుంది. అయితే తాజాగా వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా మొదలయ్యాయి. Also Read : Megastar Chiranjeevi: ”నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ”.. భార్యకు మెగాస్టార్ స్పెషల్ విషెష్ పెళ్లికి ముందు భర్తతో కలిసి ఆలయాన్ని దర్శించుకున్న రకుల్ ఈ నేపథ్యంలో.. వీరిద్దరూ ముంబయి(Mumbai) లోని ప్రసిద్ధ సిద్ది వినాయక ఆలయాన్ని సందర్శించుకున్నారు. పెళ్ళికి ముందు సంప్రదాయాల్లో భాగంగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి.. దేవుడి ఆశీర్వాదాలు తీసుకున్నారు. వీళ్లిద్దరు ఆలయానికి వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) ముంబయిలో పూజలు పూర్తయిన అనంతరం కుటుంబ సభ్యులంతా గోవా చేరుకోనున్నట్లు సమాచారం. 19వ తేదీ నుంచి.. మూడు రోజుల పాటు గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్లో రకుల్ - జాకీ వివాహ వేడుకలు గ్రాండ్ గా జరగనున్నాయి. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. అయితే రకుల్ అందరికీ బిన్నంగా ఎకో ఫ్రెండ్లీ వివాహం(Eco Friendly Marriage) చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పేపర్ వేస్టేజ్ కాకూడదని.. డిజిటల్ ఇన్విటేషన్ పంపుతున్నారు. పెళ్లిలో బాణాసంచా కూడా కాల్చకూడదని నిర్ణయించుకున్నారట. అలాగే పెళ్లికి వచ్చిన ఆహ్వానితుల చేత మొక్కలు నాటించాలని అనుకున్నారట ఈ జంట. ఇక ప్రస్తుతం రకుల్ సినిమాల విషయానికి వస్తే.. తమిళ్లో తెరకెక్కుతున్న కమల్ హాసన్ ఇండియన్ 2 లో ఫీమేల్ లీడ్ గా ప్రధాన పాత్ర పోషిస్తుంది. హిందీలో మేరీ పత్నీ కా రీమేక్ సినిమాలో నటిస్తోంది. టాలీవుడ్ రకుల్ చివరిగా నటించిన చిత్రం కొండపొలం.. ఆ తరువాత తెలుగులో మరో ప్రాజెక్ట్ చేయలేదు. Sharmila Son Haldi Photos : షర్మిల కుమారుడు రాజారెడ్డి హల్దీ వేడుకలు.. వైరలవుతున్న ఫొటోలు #rakul-marriage #tollywood #jackky-bhagnani #rakul-preet-singh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి