Rakul Preet Singh : పెళ్లి తర్వాత రకుల్ ప్రీత్.. ఏం చేసిందో చూడండి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 21న నిర్మాత జాకీ భగ్నానీతో గోవాలోని ఓ రిసార్ట్ లో ఈమె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలెబ్రెటీలు హాజరయ్యారు.

New Update
Rakul Preet Singh : పెళ్లి తర్వాత రకుల్ ప్రీత్.. ఏం చేసిందో చూడండి

Rakul Preet Singh : స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేశారు. తాజాగా ఈ బ్యూటీ మూడుముళ్ల బంధంతో.. వివాహ జీవితం(Marriage Life) లోకి అడుగుపెట్టారు. ఈ నెల 19న హల్దీతో మొదలైన వీరి వివాహ వేడుకలు.. మెహందీ, సంగీత్ వేడుకలతో సందడిగా మొదలైంది. ఆ తర్వాత బుధవారం 21న ఈ జంట మూడు మూళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. రెండు పద్ధతుల్లో ఈ జంట వివాహం జరిగింది. ముందుగా సిక్ సంప్రదాయంలో వివాహం చేసుకున్న ఈ జంట.. ఆ తర్వాత సింధీ సంప్రదాయంలో కూడా చేసుకున్నారు. గోవా(Goa) లోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్(ITC Grand Resort) లో కన్నుల పండుగగా జరిగిన వీరి వివాహ వేడుకలకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులతో పాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలెబ్రెటీలు కూడా హాజరయ్యారు.

Also Read : Bellamkonda Sreenivas : తెలుగులో ఫ్లాప్.. అక్కడ మాత్రం సూపర్ హిట్

రకుల్ పెళ్లి వేడుకల్లో శిల్పా శెట్టి డాన్స్

రకుల్ పెళ్లి వేడుకల్లో బాలీవుడ్(Bollywood) నటి శిల్పా శెట్టి.. డాన్స్ చేసి.. స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. సోనాక్షి సిన్హా, వరుణ్ ధావన్, ఆలియా భట్, అనన్య పాండే, అక్షయ్ కుమార్ దంపతులు, టైగర్ ష్రాఫ్ ప్రముఖులు సందడి చేశారు. గత మూడేళ్ళుగా ప్రేమలో ఉన్న ఈ జంట మూడు మూళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. ఈ కొత్త జంటకు సెలెబ్రెటీస్, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Rakul Marriage

Rakul Preet Singh Marriage

Also Read : Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు