Rakul Preet Singh : 'ఇండియన్ 2' లో తన పాత్రపై రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. కెరీర్ లోనే బెస్ట్ అంటూ!

'ఇండియన్ 2' సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె సినిమాలో తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.' ‘ఇండియన్‌-2’ తన కెరీర్ లోనే బెస్ట్‌ సినిమా అవుతుందని, సినిమాలో తన పాత్ర గొప్పగా ఉంటుందని' చెప్పింది.

New Update
Rakul Preet Singh : 'ఇండియన్ 2' లో తన పాత్రపై రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. కెరీర్ లోనే బెస్ట్ అంటూ!

Actress Rakul Preet Singh About Indian 2 : కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2′. 90’s లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో భారతీయుడు) మూవీకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా.. ఇటీవలే సాంగ్స్ కూడా వదిలారు.

అనిరుద్ కంపోజ్ చేసిన సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. జూలై 12 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె సినిమాలో తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Also Read : ఆనంద్ దేవరకొండలో ఈ టాలెంట్ కూడా ఉందా? ‘బేబీ’ సాంగ్ ఎంత బాగా పాడాడో చూడండి!

కెరీర్ లోనే బెస్ట్ మూవీ...

తాజా ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ.." నా కెరీర్‌లోనే ‘ఇండియన్‌-2’ బెస్ట్‌ సినిమా అవుతుంది. ఇందులో నా పాత్ర అంత గొప్పగా ఉంటుంది. నా నిజ జీవితానికి దగ్గర పోలిక ఉంది. ఎంతో ఆత్మవిశ్వాసం ఉన్న మహిళగా కనిపిస్తాను. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో నటించలేదు. ఈ సినిమా షూటింగ్ మొత్తం గొప్ప అనుభూతినిచ్చింది. శంకర్‌ వంటి అగ్ర దర్శకులతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను.

ఈ సినిమా విశేషాలను మీతో పంచుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. దానికి ఇంకా సమయం పడుతుంది" అంటూ చెప్పుకొచ్చింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాలో సిద్ధార్థ్‌, కాజల్‌ అగర్వాల్‌, ప్రియా భవానీ శంకర్‌, ఎస్‌జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు