Rajya Sabha: కుర్చీ నుంచి లేచి వెళ్లిపోయిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్

వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీలోంచి వెళ్లిపోయారు. ప్రతిపక్ష పార్టీల నేతల నినాదాలతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rajya Sabha: కుర్చీ నుంచి లేచి వెళ్లిపోయిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్
New Update

Jagdeep Dhankhar: వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీలోంచి వెళ్లిపోయారు. ప్రతిపక్ష పార్టీల నేతల నినాదాలతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినేష్ ఫోగాట్ అంశాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే లేవనెత్తారు. అనుమతి రాకపోవడంతో ప్రతిపక్ష నేతలు నినాదాలు చేశారు. దీనిపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. దేశం మొత్తం వినేష్ ఫోగాట్‌కు అండగా నిలుస్తుందన్నారు.

ప్రధాని నిన్న 'ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్' అని ప్రధాని ఫోగాట్ ను అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాని గొంతు 140 కోట్ల ప్రజల గొంతు అని అన్నారు. సమస్య పరిష్కారానికి భారత ప్రభుత్వ క్రీడా మంత్రిత్వ శాఖ, IOC అన్ని ఫోరమ్‌లలో ప్రయత్నించాయన్నారు. అయినా ప్రతిపక్ష సభ్యులు వినకుండా ఆందోళన చేశారు. దీంతో రాజ్యసభ చైర్మన్ ధన్ కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ స్థానాన్ని అగౌరవపరుస్తున్నారని ఫైర్ అయ్యారు.

#paris-olympics-2024 #vinesh-phogat #jagdeep-dhankhar #rajya-sabha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe