Rajysabha: 12 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు

12 రాజ్యస్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. సెప్టెంబర్‌ 3న తెలంగాణతో 9 రాష్ట్రాల్లో 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

New Update
Rajysabha: 12 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు

Rajya Sabha elections: రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో 9 రాష్ట్రాల్లో.. 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, బీహార్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులు లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్కొక్కరు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇకపోతే తెలంగాణ నుండి రాజ్యసభ సభ్యత్వానికి కే.కేశవరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఉప ఎన్నికలలో 12 రాజ్యసభ స్థానాల ఎన్నికకు ఈనెల 14న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఇక నామినేషన్ల దాఖలుకు ఆగష్టు 21 చివరి తేదీ. ఇక మరోవైపు బీహార్‌, హర్యానా, రాజస్థాన్‌, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 27 చివరి తేదీని ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక సెప్టెంబర్‌ 3న ఉదయం 9గం.ల నుంచి సాయంత్రం 4గం.ల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇక ఓటింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం 5 గం.ల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది.

రాజ్యసభ సభ్యులుగా ఉన్న 10 మంది ఎంపీలు.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి.. లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో ఆ 10 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరికి తోడు తెలంగాణలో రాజ్యసభ ఎంపీగా ఉన్న కే కేశవరావు.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి మారడంతో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరోవైపు.. ఒడిశాకు చెందిన ఓ రాజ్యసభ ఎంపీ కూడా రాజీనామా చేయడంతో మొత్తం ఖాళీల సంఖ్య 12 కు చేరింది.

Also Read:Vinesh Phogat: అనర్హత మీద స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టుకు వినేశ్

Advertisment
Advertisment
తాజా కథనాలు