Destination Wedding:అందం, లగ్జరీ..డెస్టినేషన్ వెడ్డింగ్‌కు బెస్ట్ ప్లేస్ రాజస్థాన్

ఈ మధ్య కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కల్చర్ బాగా ఎక్కువైపోయింది. వాళ్ళు ఉన్న చోట కాకుండా వేరే లోకేషన్‌కు వెళ్ళి మరీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. దీనికి కారణం జీవితంలో ఒకేసారి వచ్చే అద్భుతమైన క్షణాల్ని మధురంగా మలచుకోవాలనుకోవడమే.

Destination Wedding:అందం, లగ్జరీ..డెస్టినేషన్ వెడ్డింగ్‌కు బెస్ట్ ప్లేస్ రాజస్థాన్
New Update

Rajasthan Destination Wedding:డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఇప్పుడు బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి. మనదేశంలోనే వీటికి కొదువ లేదు. గోవా, రాజస్థాన్ లాంటి ప్రదేశాలు ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌లుగా మారాయి. గోవా కంటే కూడా రాజస్థాన్ దీనికి బాగా పాపులర్ అయింది. రాజస్థాన్ అంటే ఎడారులు మాత్రమే అనుకుంటారు అందరూ. అక్కడ ఎండ బాగా ఉంటుంది...వేడిలో చచ్చిపోవాలనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ కరెక్ట్ సీజన్‌లో వెళితే అంత అద్భుతమైన ప్రదేశం మరొకటి ఉండదు. అందుకే సెలబ్రెటీల బెస్ట్ ఛాయిన్ పాజస్థాన్ అవుతోంది. బాగా పాపులర్ అయిన కియారా-సిద్ధార్ధ్ మల్హోత్రాల పెళ్ళి, మన టాలీవుడ్‌లో నాగబాబు కూతురు నీహారికా పెళ్ళిళ్ళు అక్కడే అయ్యాయి. తాజాగా వైఎస్ షర్మిల కొడుకు పెళ్ళి కూడా ఇక్కడే అవుతుండడంతో మళ్ళీ మరొకసారి రాజస్థాన్ హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇక్కడ జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ ప్లేస్‌ను డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఎంచుకోవడానికి ముఖ్యంగా ఐదు కారణాలు ఉన్నాయి.

1. రాచరికం ఉట్టిపడే భవనాలు...

రాజస్థాన్ అంటే ఎడారులే కాదు రాచమహళ్ళు కూడా. చరిత్రకు ఉదాహరణలుగా మిగిలిపోయిన కోటలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. చిన్న చిన్న కోటల నుంచి పెద్ద పెద్ద మహళ్ళ వరకూ ఇక్కడ ఉన్నాయి. అందుకే రాజస్థాన్ టూరిజం కూడా చాలా పాపులర్. రాజుల కాలం నాటి ఈ కోటలను ఇప్పటికీ ఎంతో అద్భుతంగా మెయింటెయిన్ చేస్తోంది అక్కడ గవర్నమెంట్. దీంతో వారసత్వ సంపదను కాపాడుకోవడమే కాకుండా భారతదేశం ఉనికిని కూడా కాపాడుతున్నారు. 17వ శతాబ్దానికి చెందిన రాచరికాన్ని అనుభవించాలి అంటే రాజస్థాన్ కచ్చితంగా వెళ్ళాల్సిందే ఇక్కడ కోటల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటే రాజవైభోగమే. మనమున్న పిటీల్లో ఎంత డబ్బులు కర్చు పెట్టినా ఆ మహారాజ భోగం అయితే రాదు. దాని కోసమే డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ రాజస్థాన్ వెళ్ళిపోతున్నారు అందరూ. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న కోటల్లో కేవలం చారిత్రకతే కాదు దానికి తగ్గ లగ్జరీ కూడా లభిస్తుంది. ఈ వాతావరణంలో కొత్త జంటలకు మంచి రొమాంటిక్ ఫీల్ కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

2. సాంస్కృతికి అనుభవాలు..

మన దేశంలో రాజస్థాన్ సంస్కృతికి ఓ ప్రత్యేకత ఉంది. వారి అలవాట్లు, ఆటపాటలు అన్నీ వేటికవే చాలా స్పెషల్‌గా ఉంటాయి. అక్కడ జరిగే పెళ్ళిళ్ళకు ఇవి కూడా తోడవుతున్నాయి. మన సంప్రదాయం, రాజస్థాన్ సంస్కృతి కలిసి ఓ వివాహానికి ఓ కొత్తదనాన్ని, నిండు దనాన్ని తెస్తున్నాయి. ఏనుగు అంబారీలు, ఒంటెస్వారీలు, జానపద సంగీతం, తోలుబొమ్మలాటలు అదనపు ఆనందాన్నిస్తున్నాయి.

ప్రకృతి సమాహారం..

రాజస్థానం అంటే ఎడారులే కాదు ఇక్కడ పచ్చని కొండలు కూడా ఉంటాయి. ఆరావళి పర్వతాల శ్రేణి రాజస్థాన్‌కు ప్రకృతినిశోభను అందిస్తాయి. అంతేకాదు ఇక్కడ ఎన్నో అడవులు, జలపాతాలు లాంటివి కూడా ఉన్నాయి. దానికి తోడు ఇసుక తిన్నెలు, విభిన్నమైన వన్యప్రాణులతో కలిసి వింత అందాన్ని ఆపాదిస్తాయి. వీటన్నింటి మధ్యనా రాజభవనాల నుండి వారసత్వ ఆస్తులు, అతి విలాసవంతమైన హోటళ్ల వరకు, కలల వివాహానికి కావలసినవన్నీ సమకూరుస్తున్నాయి.

వివాహ వేదికలు...

రాజస్థాన్‌లో దాదాపు అన్ని కోటలను డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఇస్తున్నారు. దానికి తగ్గట్టు కోటలను ఎప్పటికప్పుడు కొత్తగా తయారు చేస్తున్నారు. పాతదనం పోకుండా...అలాగే అన్ని సౌకర్యాలు ఉండేటట్ఉ మలుస్తున్నారు. ఇక్కడ ఉన్న ఉమైద్ ప్యాలెస్, జోధ్‌పూర్‌లోని మెహ్రాన్‌ఘర్‌ కోట, బికనీర్‌లో గజ్నేర్‌ ప్యాలెస్‌లు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు బెస్ట్ వేదికగా నిలుస్తున్నాయి. ఇప్పుడు కొత్త జంటల ప్రేమకథలతో పాటూ పాతకాలపు రాజుల ప్రేమకథలు కూడా కలిసి వివాహాలకు మరింత అందాన్ని తెచ్చిపెడుతున్నాయి.

రాజస్థాన్ వంటలు..

ఇక్కడ పెళ్ళిళ్ళు జరగడానికి మరో ముఖ్య కారణం వంటలు. రాజస్థాన్ వంటలకు చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ దొరికే కొన్ని పదార్ధాలు దేశంలో మరెక్కడా దొరకవు. మన సిటీల్లో కూడా కేవలం నాజస్థానీ రుచులు అందించే రెస్టారెంట్లు ఉన్నాయి. జనాలు వాటికే వెళ్ళి తింటున్నారు. అలాంటిది అసలు సిసలైన రాజస్థానీ ఫుడ్ అంటే ఇంకా ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. గట్టెకీ సబ్జీ, దాల్ బాటీ చుర్మా లాంటి వంటకాలు పెళ్ళిళ్ళలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సాంప్రదాయ పద్ధతిలో చేసే వంటకాలు అతిధులకు మరుపురాని రుచులను అందిస్తున్నాయి.

Also Read:Sunny Leone : కానిస్టేబుల్ ఉద్యోగానికి సన్నీలియోన్..వైరల్ అవుతున్న హాట్ టికెట్

#rajasthan #marriages #destination-wedding
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe