మిచౌంగ్ (Michaung) తుఫాన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి బీభత్సం సృష్టించిందో తెలుసు. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు చెన్నై నగరాన్ని కూడా మిచౌంగ్ అతలాకుతాలం చేసింది. ఇప్పటికీ నగరంలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగే ఉన్నాయి. రెండు రోజుల నుంచి వర్షాలు తగ్గినప్పటికీ కూడా నగరం ఇంకా వరద నీటిలోనే ఉంది.
దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతుంది. నిత్యావసర వస్తువులు, ఆహారం , నీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ వరద ముంపులో కేవలం సామాన్య ప్రజలే కాదు..పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. వారిలో ప్రముఖ స్టార్ హీరో రజినీకాంత్ ఒకరు.
ఆయన నివాసాన్ని వరదు నీరు చుట్టుముట్టాయి. చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలో ఉన్న రజినీ ఇంటి ముందు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రజినీ ఇంటి ముందు నీరు నిలిచిపోయిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
కొద్దిరోజుల క్రితం చెన్నై నగరాన్ని మిచౌంగ్ తుఫాన్ అల్లాడించిన విషయం తెలిసిందే. ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వరద నీరు వల్ల అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ప్రస్తుతానికి వానలు తగ్గినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాలు వాన నీటిలోనే నానుతున్నాయి.
దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ ఆహారం, నీరు లేక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ చెన్నై ప్రజల నెత్తిన మరో పిడుగులాంటి వార్తను పడేసింది. శుక్రవారం, శనివారం తమిళనాడుతో పాటు, కేరళలో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు తెలిపింది.
రాబోయే 5 రోజుల్లో కేరళలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. అదేవిధంగా తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ లక్షద్వీప్ లో వచ్చే మూడు నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు.
Also read: చరణ్ తో కలిసి నటించాలనుకుంటున్నారా..అయితే ఈ అవకాశం మీ కోసమే!