Watch Video: గుండె ధైర్యం చేసుకొని చూడండి.. ట్రాక్టర్‌తో తొక్కించి దారుణ హత్య.. రాజస్థాన్‌లోని భరత్‌పుర్ అనే జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. ఓ భూవివాదం విషయంలో ఓ వ్యక్తిని ఏకంగా ట్రాక్టర్‌తో తొక్కించడం కలకలం రేపుతోంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 8 సార్లు ఆ వ్యక్తిని ట్రాక్టర్‌తో తొక్కించడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. By B Aravind 25 Oct 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలపై కుటుంబంలో కలహాలు, భూ వివాదాలు జరగడం లాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ గొడవల్లో ఒకరినొకరు కర్రలతో కొట్టుకోవడం, చివరికి హత్య చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా రాజస్థాన్‌లోని భరత్‌పుర్ అనే జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ భూ వివాదం విషయంలో ఓ వ్యక్తిని ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేయడం కలకలం రేపింది. మరో విషయం ఏంటంటే ఆ వ్యక్తిని చంపిన నిందితుడు అతని సోదరుడే కావడం గమనార్హం. ఇక వివరాల్లోకి వెళ్తే.. నిర్పత్ గుర్జర్, దామోదర్ గుర్జర్ అనే ఇద్దరు వ్యక్తులు అన్నాదమ్ముళ్లు. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా ఓ భూ వివాదం విషయంలో తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. మూడు రోజుల ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. అయితే ఈరోజు కూడా ఇరువురి బంధువుల మధ్య గొడవ జరిగింది. అయితే ఈసారి ఈ గొడవ తీవ్రతరం కావండతో దామోదర్ గుర్జర్ ఆగ్రహంతో.. తన సోదరుడు నిర్పత్ గుర్జర్‌పై ట్రాక్టర్‌తో తొక్కించాడు. ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు 8 సార్లు నిర్పత్‌ను నిందితుడు ట్రాక్టర్‌తో తొక్కించాడు. అలాగే ఈ ఘటనలో మరికొందరికి గాయాలయ్యాయి. Also read: రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఎరువులపై సబ్సిడీ.. సమాచారం ప్రకారం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు ఆరుగురుని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నిర్పత్ గుర్జర్‌ను ట్రాక్టర్‌తో తొక్కించిన అతని సోదరుడు దామోదర్ పరారీలో ఉన్నాడని.. నిందితుడ్ని పట్టుకునేందుకు చర్యలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటీజన్లు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో చూసేయ్యండి. इंसान या राक्षस?? ये भयंकर दृश्य राजस्थान के भरतपुर का है, ज़मीन विवाद में झगड़े के दौरान निरपत गुर्जर गिर गया जिस पर बहादुर गुर्जर के लोगों ने ट्रैक्टर चढ़ा दिया. 8 बार पहिया चढ़ाए जाने से निरपत ने मौक़े पर ही दम तोड़ दिया. आरोपी फ़रार हो गए. Disclaimer: वायरल वीडियो… pic.twitter.com/SFM7YVcuDK — gyanendra shukla (@gyanu999) October 25, 2023 #telugu-news #national-news #land-dispute #tractor మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి