బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఆ షోరూమ్‌లో నుంచి వస్తువులు కొని.. పేటీఎం నుంచి బిల్లు చెల్లించి మళ్లీ తమ ఖాతాల్లోకి డబ్బులు మళ్లించున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎస్సార్‌నగర్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంకు గత నెలలో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. రూ. 4 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఏసీలు, సెల్‌ఫోన్‌లు కొన్నారు. వీటికి డబ్బులు తమకు తెలిసినవారు పేటీఎంలో చెల్లిస్తారని చెప్పి.. క్యూఆర్ కోడ్‌ను అవతలి వ్యక్తికి పంపారు. దీంతో రాజస్థాన్‌ను నుంచి ఓ వ్యక్తి పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించాడు.
Also read: క్షణాల్లో నేలమట్టమైన 22 అంతస్తుల భారీ భవనం.. వీడియో వైరల్
డబ్బులు షోరూమ్ బ్యాంకు ఖాతాలో పడ్డాకా వారు కొన్న పరికరాలను తీసుకెళ్లారు. ఆ తర్వాత రాజస్థాన్ నుంచి డబ్బులు చెల్లించిన వ్యక్తి ఛార్జబ్యాక్ ఆప్షన్‌ను వినియోగించాడు. తన అకౌంట్‌లో నుంచి ఖాతా డబ్బులు తన ప్రమేయం లేకుండా షోరూమ్‌కు బదిలీ అయ్యాయని తప్పుడు ఫిర్యాదు చేశారు. చివరికి తాను చెల్లించిన డబ్బులను తిరిగి తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన షోరూమ్ క్యాషియర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.